తాజాగా నందమూరి బాలకృష్ణ అఖండ 2 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించగా ... బోయపాటి శ్రీను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట నిర్మించారు. ఈ మూవీ ని మొదట డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల సమయం అత్యంత పడిన టైం లో ఈ మూవీ విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత ఈ సినిమాను డిసెంబర్ 12 వ తేదీన విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను డిసెంబర్ 11 వ తేదీన పెద్ద ఎత్తున ప్రదర్శించారు. ఈ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారానే కాస్త నెగటివ్ టాక్ వచ్చింది. అయిన కూడా ఈ సినిమాకు మొదటి రోజు ఓపెనింగ్లు అద్భుతమైన స్థాయిలో దక్కాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకునే అవకాశాలు చాలా వరకు కనబడుతున్నాయి. కానీ ఒక్క ఏరియాలో మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి అత్యంత దగ్గరగా వచ్చింది.

ఒక వేళ ఆ ఏరియాలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకోకపోయినా చాలా తక్కువ నష్టాలతో బయటపడే అవకాశం ఉన్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇంతకు అది ఏ ఏరియా అనుకుంటున్నారా ..? అదే ఏదో కాదు నైజాం ఏరియా. నైజాం ఏరియాలో ఈ సినిమా 20.50 కోట్ల రేంజ్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ కి నైజాం ఏరియాలో ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చాయి. ఆ తర్వాత కూడా ఈ సినిమాకు నైజాం ఏరియాలో మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు నైజాం ఏరియాలో 18.5 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లు వచ్చాయి. ప్రస్తుతం క్రిస్మస్ హాలిడేస్ స్టార్ట్ కావడంతో ఈ హాలిడేస్ సహాయంతో ఈ సినిమా నైజాం ఏరియాలో మరి కాస్త కలెక్షన్లను వసూలు చేసి దాదాపు బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుంటుంది అని ఒక వేళ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను చేరుకోకపోయినా నైజాం ఏరియా లో మాత్రం అత్యంత తక్కువ నష్టాలను అందుకుంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: