హీరోయిన్ హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హనుమంతు, త్రిగుణ్, డైరెక్టర్ శ్రీనివాస్ మన్నే దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఈషా. ప్రస్తుతం ఉన్న రోజులలో హర్రర్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. భారీ అంచనాల మధ్య ఈ రోజున అదే జోనర్ లో వచ్చిన ఈషా సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
స్టోరీ విషయానికి వస్తే:
కళ్యాణ్ (త్రిగుణ్), నయన (హెబ్బా పటేల్), వినయ్ (అఖిల్ రాజ్), అపర్ణ (సిరి హనుమంత్) ఈ నలుగురు చిన్నప్పటినుంచే స్నేహితులు అయితే ఇందులో అపర్ణ, వినయ్ వివాహం చేసుకుంటారు. నయనను కళ్యాణ్ ప్రేమిస్తూ ఉంటారు. అలా ఈ నలుగురు కూడా ఉద్యోగాలు చేసుకుంటూనే సమాజంలో మూఢనమ్మకాలు ,దొంగ బాబాల పేర్లతో మోసం చేస్తున్న వారిని అరికట్టాలని చూస్తూ ఉంటారు. అలా అమెరికాలో మానసిక వైద్యుడిగా ఉండి తన భార్య మరణం తర్వాత , బాబా అవతారం ఎత్తిన అది దేవ్ (పృథ్వీ రాజ్) గురించి తెలుస్తోంది. అతడి నిజస్వరూపం బయటపెట్టాలని వెళుతున్న సమయంలో ఒక పెద్ద యాక్సిడెంట్ అనుకోకుండా జరుగుతుంది. ఆ తరువాత పుణ్యవతి (మైమ్ మధు) ఆ నలుగురిని వెంబడిస్తుంది. వాళ్లకు పుణ్యవతికి ఎలాంటి సంబంధం అనేది ఈ సినిమా కథ.
ఈ చిత్రంలో ఆత్మలతో భయపెట్టాలని చూసిన డైరెక్టర్ శ్రీనివాస్ మన్నే బాగానే సక్సెస్ అయ్యారు. డైరెక్టర్ 40% సక్సెస్ అయితే ,మ్యూజిక్ డైరెక్టర్ 60% న్యాయం చేశారు. అక్కడక్కడ కొన్ని సీన్స్ ల్యాగ్ ఫీలింగ్స్ ని కలిగిస్తాయి. ఇంటర్వెల్ వరకు స్లోగా వెళ్లిన కథ ఇంటర్వెల్ తర్వాత ఊపందుకు ఉంటుంది. ముఖ్యంగా చివరి 20 నిమిషాల పాటు ఉత్కంఠ పరుస్తుంది. అందులో కొన్ని ట్విస్టులు రివీల్ చేసినప్పుడు మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఈ సినిమాకి క్లైమాక్స్ ప్రాణం.
ప్లస్ పాయింట్స్:
సెకండాఫ్ లో వచ్చే హర్రర్ సీన్స్
క్లైమాక్స్
మైనస్:
రోటీన్ కథ
ఊహలకందే సన్నివేశాలు
నటీనటులు:
హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హనుమంతు, త్రిగుణ్ ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు.ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారు.మరో కీలకమైన పాత్రలో పృథ్వీరాజ్ అద్భుతంగా నటించారు.
సినిమాకి మ్యూజిక్ అందించిన RR ధ్రువన్ పూర్తిగా న్యాయం చేశారు. ప్రతి సీన్ కి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఎడిటింగ్ కూడా సూపర్.
ఈషా చిత్ర మేకర్స్ చెప్పినట్లుగా గుండె ఆగిపోయేంత భయం అయితే లేదు. కానీ భయపెడుతుంది. ఇది ఒక డిఫరెంట్ హార్రర్ థ్రిల్లర్ చిత్రమే.
రేటింగ్:
2.5/5

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి