టాలీవుడ్ లో నటుడుగా, డైరెక్టర్ గా పేరు సంపాదించిన తరుణ్ భాస్కర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. గత కొంతకాలంగా ప్రముఖ హీరోయిన్ ఈషా రెబ్బా తో వివాహమంటూ పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి ఓం శాంతి శాంతి శాంతి సినిమాలో నటించారు.  సినిమా వచ్చే ఏడాది జనవరి 23న విడుదల కాబోతోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి, వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా మరింత బలాన్ని చేకూర్చాయి. ప్రస్తుతం ఈ జంట సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు.దీంతో టాలీవుడ్ లో ఈ జంట విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది.

 అయితే ఈ విషయం తాజాగా ఈషా రెబ్బా దృష్టిలో పడింది.ఈ విషయం పైన ఇంస్టాగ్రామ్ ద్వారా చాలా విభిన్నంగా స్పందించి అందర్నీ షాక్ గురి చేసింది.. ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అని అడిగేవారికి ఒక సమాధానాన్ని వైరల్ మిమ్స్ వీడియోతో అదిరిపోయే రిప్లై ఇచ్చింది. ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు పాత ఇంగ్లీష్ స్పీచ్ ని బ్యాగ్రౌండ్ లో జోడిస్తూ మరి సమాధానాలను తెలిపింది.


ఏ ఏ పనులు ఏ ఏ సమయాలలో జరగాలో ఆయా పనులు ఆ సమయాలలో జరిగే తీరుతాయి అంటూ ఒక డైలాగ్ తో హీరోయిన్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అందర్నీ కడుపుబ్బ నవ్విస్తున్నాయి. ఈషా రెబ్బా రెడ్ అండ్ యెల్లో కలర్ శారీలో కనిపిస్తూ పెళ్లి గురించి తనకేమి తొందర లేదు అంతా కాలమే నిర్ణయిస్తుందని ఇన్ డైరెక్ట్ గా చెప్పినట్టు కనిపిస్తోంది. ఈ సెటైరికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు తెగ వైరల్ గా చేస్తున్నారు. మరి కొంతమంది ఫన్నీగా కామెంట్స్ చేస్తూ ఏదైనా భారీ ట్విస్ట్ ప్లాన్ చేశారా అంటు కామెంట్స్ చేస్తున్నారు. మరి అసలు విషయంపై ఎవరు డైరెక్టుగా క్లారిటీ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: