ఈ మధ్య కాలంలో యూత్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ వారం విడుదలైన సినిమాలలో బ్యాడ్ గాళ్స్ (కానీ చాలా మంచోళ్లు) సినిమా మంచి అంచనాలతో థియేటర్లలో విడుదలైంది. క్రైమ్, ఎమోషన్స్, కామెడీ ఇలా అన్ని అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి (మున్నా) యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఈ సినిమాను తెరకెక్కించారు.

కథ :

హైదరాబాద్ లో హాస్టల్ లో గడిపే నలుగురు అమ్మాయిల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.   రోజీ రెడ్డి, మల్లీశ్వరి, మెర్సీ, వెంకట్ లక్ష్మి అనే నలుగురు అమ్మాయిలలో ఇద్దరు అమ్మాయిలకు జాన్, నాయుడు అనే వ్యక్తులతో నిశ్చితార్థం జరుగుతుంది.   ఇద్దరు అమ్మాయిలకు ఎంగేజ్మెంట్ జరగడంతో నలుగురు అమ్మాయిలు కలిసి మళ్ళీ ట్రిప్ కు వెళ్లే ఛాన్స్ వస్తుందో రాదో అని ట్రిప్ ప్లాన్ చేస్తారు.  సరదాగా మలేషియాకు ప్రయాణం చేయాలని భావించిన ఈ నలుగురు అమ్మాయిలకు ఊహించని సమస్యలు ఎదురవుతాయి.  అనకొండ అనే టెర్రరిస్ట్ మలేషియాలో బాంబు దాడిని ప్లాన్ చేయడంతో పాటు ఒక ఉమెన్ ట్రాఫికింగ్ గ్యాంగ్  ఈ నలుగురు అమ్మాయిలను కిడ్నాప్ చేయడానికి  ప్రయత్నిస్తారు.  ఈ సమస్యల వల్ల ఆ అమ్మాయిల జీవితాలలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి? చివరకు ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

విశ్లేషణ :

అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్న ప్రధాన పాత్రల్లో కనిపించగా తమ నటనతో ఆకట్టుకున్నారు. నలుగురు అమ్మాయిలు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.  మోయిన్, రోహన్ సూర్య పాత్రలు  సైతం సినిమాలో ఆకట్టుకునేలా ఉన్నాయి.  బిగ్ బాస్ ఫేమ్ స్రవంతి,   రాజా రవీంద్ర,   తాగుబోతు రమేష్ సినిమాలో ఇతర పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు.

దర్శకుడు సినిమాలో కామెడీకి పెద్దపీట వేశారు.  నలుగురు స్నేహితులు ఫారిన్ ట్రిప్ కు వెళ్లాలని అనుకోవడం, అక్కడ ఊహించని పరిస్థితులు  ఎదురు కావడం లాంటి సన్నివేశాలు తెరపై ప్రేక్షకులను మెప్పించే రీతిలో ఉన్నాయి.  ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులను ఒకింత  ఆశ్ఛర్యానికి గురి చేయడంతో పాటు సెకండాఫ్ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తిని కలిగిస్తుంది.

క్రైమ్, థ్రిల్లింగ్ అంశాలు కూడా సినిమాలో ఉండటంతో  సెకండాఫ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది.  ఎమోషనల్ టచ్ తో కూడిన క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.  కథ కొత్తగా లేకపోయినా కథనం అద్భుతంగా ఉండటం సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు.

అయితే కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అయిన ఫీల్ ను తెప్పిస్తాయి.  ఈ వారం స్నేహితులతో లేదా ఫ్యామిలీతో మంచి ఎంటర్టైనర్ చూడాలని భావించే వాళ్లకు బ్యాడ్ గాళ్స్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.  యూట్యూబ్ ద్వారా పాపులర్ పాయల్ చెంగప్ప లుక్స్ బాగున్నాయి.

టెక్నీకల్ అంశాల విషయానికి వస్తే అనూప్ రూబెన్స్ మ్యూజిక్, బీజీఎమ్ తో సత్తా చాటారు.   అర్లి గణేష్ సినిమాటోగ్రఫీ  సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. నిర్మాతలు ఖర్చు విషయంలో అస్సలు రాజీ పడలేదు. మలేషియాలో మెజారిటీ సన్నివేశాలను షూట్ చేయడంతో సినిమాలో విజువల్స్ సైతం అద్భుతంగా ఉన్నాయి.

మంచి సంగీతం, కలర్ ఫుల్ విజువల్స్, కొంత కామెడీ, ఇంకొంత ఎమోషన్‌తో సాగే క్రైమ్ కామెడీ-థ్రిల్లర్ చూడాలని భావించే వాళ్ళు ఈ సినిమాపై  ఒక లుక్కేయొచ్చు.

రేటింగ్ : 2.75/5.0

మరింత సమాచారం తెలుసుకోండి: