- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’ విడుదల తేదీ దగ్గరపడుతున్నా, ప్రమోషన్ల విషయంలో సినిమా యూనిట్ అనుసరిస్తున్న తీరు అభిమానులను తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. జనవరి 9న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అంటే సమయం కేవలం పది రోజులు మాత్రమే ఉంది. ఈ తక్కువ సమయంలో భారీ ఎత్తున ప్రమోషన్లు నిర్వహించాలి. కనీసం ఈవెంట్ల విషయంలో కూడా చాలా ఆల‌స్యంగా క్లారిటీ వ‌చ్చింది. ప్ర‌భాస్ అంటేనే పాన్ ఇండియా రేంజ్ లో ఏ స్థాయి లో ? అంచ‌నాలు ఉంటాయో చెప్ప‌క్క‌ర్లేదు. అలాంటి సినిమాకు అస్స‌లు మినిమం రేంజ్ లో ప్ర‌మోష‌న్లు జ‌ర‌గ‌క పోవ‌డంతో ప్ర‌భాస్ అభిమానులు మేక‌ర్స్ పై తీవ్ర అస‌హ‌నంతో ఉన్నారు.


ప్రమోషన్లలో వేగం పెరగాలి :
ఇప్పటివరకు విడుదలైన రెండు టీజర్లు, రెండు పాటలకు స్పందన బాగున్నప్పటికీ, అది ‘ఎక్స్‌ట్రార్డినరీ’ అనిపించుకోలేదు. సినిమాపై హైప్ పెంచాలంటే ప్రభాస్ స్వయంగా రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. 'సలార్', 'కల్కి 2898 AD' సినిమాల సమయంలో కూడా ఇలాగే చివరి నిమిషం వరకు ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు ‘రాజా సాబ్’ విషయంలోనూ అదే రిపీట్‌ కావడం ఫ్యాన్స్‌ని నిరాశ పరుస్తోంది.


గ‌ట్టి పోటీ మ‌ధ్య‌లో రిలీజ్ :
సంక్రాంతి బరిలో ‘రాజా సాబ్’తో పాటు 'నారి నారి నడుమ మురారి', 'జన నాయకుడు', 'అనగనగా ఒక రాజు' వంటి సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇంతటి పోటీ మధ్య నిలబడాలంటే సినిమా ప్రమోషన్లు ఓ రేంజ్‌లో ఉండాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఇప్పటికైనా మేల్కొని కొత్త పబ్లిసిటీ స్ట్రాటజీలను అమలు చేయాలి. ప్రభాస్ కొత్త లుక్ ఎలా ఉండబోతోంది? సెన్సార్ టాక్ ఏంటి ? వంటి విషయాలపై అధికారిక క్లారిటీ ఇస్తే ఫ్యాన్స్ ఆందోళన తగ్గుతుంది. డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు ఫలితం దక్కాలంటే మేకర్స్ తక్షణమే స్పందించి అప్‌డేట్స్ ఇవ్వాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: