పారితోషికాల మాయాజాలం - ప్రేక్షకులపై భారం :
ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే, మార్కెట్ లెక్కలతో సంబంధం లేకుండా పారితోషికాలు డిమాండ్ చేస్తున్నారు.
ఒక స్టార్ హీరో రూ. 140 కోట్లు, దర్శకుడు రూ. 100 కోట్లు అడిగితే, సినిమా మొదలవ్వకముందే కేవలం ఇద్దరి కోసమే రూ. 240 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనికి తోడు ప్రొడక్షన్ ఖర్చులు, భారీ సెట్టింగులు, వడ్డీలు కలిపితే విడుదల నాటికి బడ్జెట్ తడిసి మోపెడవుతోంది. నిర్మాత తన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లపై ఒత్తిడి తెస్తున్నారు. వారు తమ వంతుగా టికెట్ ధరలు పెంచమని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంటే, హీరోల విలాసవంతమైన పారితోషికాల భారం పరోక్షంగా సామాన్య ప్రేక్షకుడి జేబుకే చిల్లు పెడుతోంది.
ఫ్యాన్ వార్స్ - ఒక విషాదకర వాస్తవం :
సోషల్ మీడియాలో అభిమానులు "మా హీరోకి వంద కోట్లు.. మీ హీరోకి డెబ్బై కోట్లు" అంటూ తమ హీరో పారితోషికం గురించి గర్వంగా చర్చించుకుంటున్నారు. కానీ, ఆ భారీ పారితోషికమే రేపు తాము కొనే టికెట్ రేటును పెంచుతుందని వారు గ్రహించడం లేదు. ఈ రెమ్యునరేషన్ రేస్ ఇండస్ట్రీని సంక్షోభంలోకి నెట్టడమే కాకుండా, థియేటర్ల వ్యవస్థను దెబ్బతీస్తోంది. ఫలితంగా ప్రేక్షకులు ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారు.
పరిష్కార మార్గాలు: మార్పు ఎక్కడ మొదలవ్వాలి ..?
సినిమా పరిశ్రమ మనుగడ సాగించాలంటే కొన్ని మార్పులు కావాలి. అగ్ర హీరోలు, దర్శకులు ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ కాకుండా, సినిమా లాభాల్లో వాటా తీసుకునే పద్ధతిని అనుసరించాలి. దీనివల్ల నిర్మాతపై భారం తగ్గుతుంది. నిర్మాతలు కూడా స్టార్లను అతిగా లాలించడం మాని, బడ్జెట్ పరిమితులపై కఠినంగా ఉండాలి. పారితోషికాలకు ఇచ్చే ప్రాధాన్యతను తగ్గించి, ఆ సొమ్మును సాంకేతిక విలువలు మరియు కథాబలంపై వెచ్చించాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి