మాసబ్ ట్యాంక్ పోలీసులు, తెలంగాణ ఈగల్ టీమ్ సంయుక్తంగా దాడి చేయగా కొకైన్, MDMA స్వాధీనం చేసుకున్నారు. అలాగే ట్రూఫ్ బజార్ కు చెందిన నితిన్, శ్రనిక్ అనే ఇద్దరు వ్యాపారస్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని మరి విచారిస్తున్నారు. వీరిద్దరూ కూడా విస్తుపోయే నిజాలు బయటపెట్టినట్లు సమాచారం. వీరికి నలుగురు రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారని అందులో ఒకరు రకుల్ ప్రీతిసింగ్ సోదరుడు అయాన్ ప్రీతిసింగ్ అంటూ తెలిపారని అధికారులు తెలియజేశారు. ఈ ఇద్దరు వ్యాపారస్తుల దగ్గర రెగ్యులర్గా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసులు ఈ నిందితుల దగ్గర నుంచి 43 గ్రాముల కోకైన్, MDMA స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ సోదరుడు పరారీలో ఉన్నారు. అయాన్ ప్రీతిసింగ్ కోసం పోలీసులు కూడా మమ్మరంగా గాలిస్తున్నట్లు సమాచారం. ప్రత్యేకంగా రంగంలోకి దిగిన ఈగల్ టీమ్ పలు ప్రాంతాలలో సోదరులను నిర్వహించారు. గతంలో చాలామంది సిని సెలబ్రిటీలు కూడా ఈ డ్రగ్స్ కేసు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా మళ్లీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సొంత తమ్ముడు పేరు వినిపించడంతో ఈ విషయం మరొకసారి హాట్ టాపిక్ గా మారింది. గత ఏడాది కూడా పోలీసులకు పట్టుబడిన అయాన్ ప్రీతిసింగ్ బెయిల్ మీద ఉన్నట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి