టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన ది రాజా సాబ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాలో నీది అగర్వాల్ , మాళవిక మోహన్ , రీద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ప్రస్తుతం హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న జన నాయగన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను కూడా వచ్చే సంవత్సరం జనవరి 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.

ఈ రెండు సినిమాల విడుదల తేదీలు దగ్గర పడడం తో ఇప్పటికే ఈ రెండు మూవీ ల బృందాల వారు ఈ సినిమాకు సంబంధించిన యు ఎస్ ఏ ప్రీమియర్ బుకింగ్స్ ను ఓపెన్ చేశారు. ఈ రెండు సినిమాల యూ ఎస్ ఏ  ప్రీమియర్స్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. కానీ జన నాయగన్ సినిమాతో పోలిస్తే ది రాజా సాబ్ మూవీ పై యు ఎస్ ఏ ప్రేక్షకులు కాస్త ఎక్కువ ఆదరణ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు యూ ఎస్ ఏ ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్ ద్వారా ది రాజా సాబ్ మూవీ కి 175.5 కే సేల్స్ దక్కగా , జన నాయగన్ మూవీ కి 102.8 కే సేల్స్ జరిగినట్లు తెలుస్తుంది. ఇలా ఇప్పటివరకు జరిగిన యు ఎస్ ఏ ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో జన నాయగన్ మూవీ తో పోలిస్తే ది రాజా సాబ్ మూవీ పై అక్కడి ప్రేక్షకులు మంచి ఆదరణ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రెండు సినిమాలలో ఏ సినిమా మంచి టాక్ ను తెచ్చుకొని ఫైనల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి యూ ఎస్ ఏ లో ఎక్కువ కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: