తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో చిరంజీవి,బాలకృష్ణ, మోహన్ బాబు అంటే తెలియని వారు ఉండరు. ఇంచుమించు ఈ హీరోలంతా ఒకే ఏజ్ గ్రూప్ కు చెందినవారు.. అంతేకాదు ఒకరిని మించి ఒకరు సినిమాలు చేసి మంచి గుర్తింపు పొందారు.. అయితే అప్పట్లో ఈ ముగ్గురు హీరోల మధ్య సినిమాల విషయంలో విపరీతమైన పోటీ ఉండేది. కేవలం సినిమాలే కాకుండా డైరెక్ట్ గా కూడా ఈ హీరోల మధ్య విభేదాలు ఉన్నాయి.. ముఖ్యంగా చిరంజీవి, మోహన్ బాబు మధ్య ఒక వేడుక సందర్భంగా విభేదాలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని బాలకృష్ణ స్వయంగా చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. బాలకృష్ణ ఎప్పుడు ఏది మాట్లాడినా ముక్కుసూటిగా మాట్లాడుతారు.. తన మనసులో ఏది ఉంటే అది బయట పెడతారు.. అంతేకాదు వివాదాలను కూడా ఆయన పట్టించుకోరు.'

 తాజాగా బాలకృష్ణ నటించి రిలీజ్ అయిన అఖండ -2 థియేటర్లలో నడుస్తోంది.. అయితే అప్పట్లో ఓ ఇంటర్వ్యూ లో ఆయన చిరంజీవి, మోహన్ బాబు మధ్య ఉన్నటువంటి విభేదాల విషయాన్ని బయట పెట్టారు. 2007లో తెలుగు చిత్ర పరిశ్రమ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఆ సమయంలో చిరంజీవి మోహన్ బాబు మధ్య  పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత  గొడవ జరిగిందని చెప్పుకొచ్చారు.. సీనియారిటీ,లెజెండ్ అనే గుర్తింపు విషయంలో మోహన్ బాబు తీవ్రంగా మన స్థాపానికి గురయ్యారు. అంతేకాదు ఈ స్టేజ్ పైనే చిరంజీవిని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు ఈ ఇష్యూలో మోహన్ బాబు కి చిరంజీవి కౌంటర్ ఇవ్వడం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా సంచలన వ్యాఖ్యలను చేయడం అప్పట్లో వివాదంగా మారింది.. అయితే ఈ వేడుకల సందర్భంగా మోహన్ బాబు,చిరంజీవి లెజెండ్ అనే హోదా కోసం కొట్టుకున్నారు.

అక్కడికి ముఖ్యఅతిథిగా అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి వచ్చారు. వీరి మధ్య గొడవ చూసి ఆయన ఇష్యూ ఇప్పట్లో తేలేలా లేదు మనం వెళ్ళిపోదాం పదా అంటూ తన పీఏతో అన్నారు. దీంతో తన పీఏ సార్ మనం ఒక్కరిని సన్మానించి వెళ్లాలని అడిగారు. ఎవర్ని  సన్మానిద్దాం ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది కదా అని చెప్పుకొచ్చారు రాజశేఖర్ రెడ్డి.. వెంటనే పిఏ సార్ బాలకృష్ణను సన్మానిద్దాం అంటూ చెప్పుకొచ్చారు.. దీంతో రాజశేఖర్ రెడ్డి వెంటనే బాలకృష్ణను అక్కడికి పిలిచి సన్మానం చేశారు. ఈ విధంగా చిరంజీవి మోహన్ బాబుకి వచ్చిన విభేదాల వల్ల రాజశేఖర్ రెడ్డి గారు వారిని సన్మానించలేకపోయారు.. కానీ వారి కంటే పెద్ద హోదా బాలకృష్ణకు ఉందని ఆయన భావించి బాలకృష్ణని సన్మానించి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన విషయాన్ని పలు సందర్భాల్లో బాలకృష్ణ బయట పెట్టడంతో వారి మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయనే విషయం బట్ట బయలయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: