150 కోట్ల మంది భారతీయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి పనిని నవంబర్ 2న ,2025న హర్మన్ ప్రీతి కౌర్ సారధ్యంలో భారత్ మహిళా జట్టు మొదటిసారి ఐసీసీ మహిళా ప్రపంచకప్ ను గెలుచుకుని ఒక చరిత్ర సృష్టించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా టీం 298 పరుగులు చేయగా దక్షిణాఫ్రికా జట్టు కేవలం 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఇండియా విజయం సాధించగా,ఈ విజయం భారత మహిళాలోకానికి చాటి చెప్పేలా చేశారు. భారత్ మహిళా జట్టు ప్రపంచ కప్ ఫైనల్ వరకు ఎన్నోసార్లు వెళ్లిన ఓడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.



అలా 2005లో మొదటిసారి మహిళా వన్డే ప్రపంచ కప్ ఫైనల్ వరకు వెళ్ళింది. దక్షిణాఫ్రికాలో భారత్ ఆస్ట్రేలియా తలపడక టీమిండియా 98 పరుగులు తేడాతో ఓడిపోయింది. మరొకసారి 2017లో రెండవ ఫైనల్ లో ఆడింది. అక్కడ ఇంగ్లాండ్ టీమ్ ఇండియా టీమ్ ను 9 పాల్గొన్న తేడాతో ఓడించింది. ఈ ఓటమి మమ్మల్ని చాలా బాధించింది విజయానికి చేరువుగా వచ్చి చేజార్చుకున్నాము..కానీ ఈసారి మాత్రం ఇలాంటివి జరగకుండా ఉండేందుకు రాత్రి పగళ్ళు ప్రాక్టీస్ చేయించారు కోచ్ అమోల్ మంజుధర్ అంటూ భారత్ మహిళా క్రికెటర్లు తెలియజేశారు. ఆయన వల్లే ఈసారి ఛాంపియన్గా అవతరించగలిగామంటూ తెలిపారు.



టీమిండియా విజయం తర్వాత జట్టుకు 4.48 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా రూ.40 కోట్ల రూపాయల వరకు బహుమతులు లభించింది. ఇది మహిళ లేదా పురుషుల క్రికెట్ చరిత్రలోనే ఇప్పటివరకు ఇచ్చినటువంటి అతిపెద్ద ప్రైజ్ మనీగా నిలిచింది. తొలి ప్రపంచ కప్ లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన మహిళ క్రికెటర్స్ కూడా ఉన్నారు. వీరిని ఏపీ ప్రభుత్వం కూడా సత్కరించి తగిన బహుమతి కూడా అందించారు. వీరే కాకుండా ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి మహిళ క్రికెటర్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సత్కరించి వారికి తగిన గౌరవం ఇచ్చారు. మొత్తానికి ఈ ఏడాది (2025) మహిళా క్రికెటర్లు సరికొత్త హిస్టరీని క్రియేట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: