టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం కింగ్డమ్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిర్మించారు. అయితే ఈ సినిమాకి ఊహించని ఫ్లాప్ టాక్ రావడంతో పాటుగా సినిమా పైన చాలానే విమర్శలు వినిపించాయి. సినిమా బడ్జెట్ కూడా భారీగా ఖర్చు చేయడంతో అనుకున్నంత స్థాయిలో లాభాలను రాలేదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ వంశీ కింగ్డమ్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణాలను తెలియజేశారు.



నాగ వంశీ మాట్లాడుతూ మేము ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాము. ఇందులోని కొన్ని సీన్స్ విషయంలో డైరెక్టర్ గౌతమ్ తో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ముఖ్యంగా సత్యదేవ్ పాత్ర చనిపోయే సన్నివేశం తర్వాత.. మరో అమ్మాయితో పడుకునే సీన్ చూపించారు. అయితే ఆ సీన్ జనాలకు తప్పుగా వెళుతుందని చెప్పాము.. ఆ సీన్ తీసేయమని డైరెక్టర్ కి కూడా చెప్పాము.. కానీ డైరెక్టర్ మాత్రం తాను వేరే కోణంలో ఆలోచిస్తున్నానని చెప్పి గౌతమ్ వినలేదని.. ఆ సీన్ ప్లేస్ లో మేము హీరోయిన్, విజయ్ కి డ్రగ్ ఇచ్చినట్టుగా చూపించమని చెప్పాము. కానీ డైరెక్టర్ మాత్రం వినలేదని తెలిపారు.

ఆసీన్ అలాగే ఉంచారు.. ఆసీనే కింగ్డమ్ సినిమా ఫ్లాప్ కి కారణమనుకుంటున్నానని తెలిపారు. ఆ సీన్ ఆడియన్స్ కి మరొక లాగా చేరడంతో ఆ ఎఫెక్ట్ సినిమా మీద పడిందనుకున్నాను అంటూ తెలిపారు నాగ వంశీ. ఇక కథ పరంగా కూడా ఆడియన్స్ కి సినిమా బాగానే కనెక్ట్ అయినప్పటికీ ఇందులో కొన్ని సీన్స్ కారణం వల్ల మొదటి షో నుంచి నెగటివ్ టాక్ వినిపించింది. ఈ ఎఫెక్ట్ అటు విజయ్, సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన కూడా ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: