దీంతో ఒక్కసారిగా అక్కడ పరిస్థితి అధికారులు కంట్రోల్ చేయలేనంతగా మారిపోయింది. చెన్నై ఎయిర్ పోర్ట్ కొద్దిసేపు జనసందోహంతో నిండిపోయింది.. భారీ జన సందోహం మధ్య విజయ్ తన కారులో ఎక్కేందుకు వెళ్తూ ఉండగా, అభిమానులు ఒక్కసారిగా తోపులాటకు గురయ్యారు. దీంతో విజయ్ కాలుజారి కూడా కింద పడినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ వెంటనే అప్రమత్తమైన భద్రత సిబ్బంది విజయ్ ను చుట్టుముట్టి మరి సురక్షితంగా బయటికి తీసుకువెళ్లినట్లు కనిపిస్తోంది.
అయితే అదృష్టవశాత్తు హీరో విజయ్ కి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం విజయ్ సేపు గానే ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనకు ప్రధాన కారణం అక్కడ క్రౌడ్ కంట్రోల్ చేయకపోవడమే అన్నట్లుగా వినిపిస్తున్నాయి. విజయ్ ఇటీవల సినిమాలకు కూడా గుడ్ బై చెప్పి పూర్తిగా రాజకీయాలకు తన సమయాన్ని కేటాయించబోతున్నట్లు ప్రకటించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే పార్టీ నుంచి అన్ని నియోజవర్గాలలో పోటీ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే విజయ్ భద్రత పైన మరింత దృష్టి పెట్టాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగన్ జనవరి 9- 2026 న తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి