మరో రెండు రోజులలో 2025 అయిపోతుంది.. అక్కడినుంచి సంక్రాంతి సినిమాల ఫెస్టివల్ మొదలవుతుంది. ఈసారి కూడా ఎప్పటిలాగే సంక్రాంతి బరిలో బడా సినిమాలు సైతం విడుదల కాబోతున్నాయి. చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు, ప్రభాస్ రాజా సాబ్, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, రవితేజ నటిస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నటిస్తున్న నారి నారి నడుమ మురారి, విజయ్ నటించిన జననాయగన్ సినిమాలు సంక్రాంతికి పోటీ పడుతున్నాయి. ఇన్ని చిత్రాలు సంక్రాంతికి పోటీ పడడంతో సినిమాల బిజినెస్ వ్యవహారం అంత సులువుగా తేలడం లేదు.


పైపైకి ఎవరికివారు అన్ని ఏరియాలలో కూడా అమ్మేసినట్టుగా నిర్మాతలు సైతం చెబుతున్నప్పటికీ,  సంక్రాంతి సినిమాల విడుదల పోటీ ఎక్కువగా ఉండడంతో బయ్యర్లు సందిగ్ధంలో ఉన్నట్లుగా  నిపుణులు తెలియజేస్తున్నారు. రాజాసాబ్ సినిమా జనవరి 9 ముందే విడుదల కాబోతోంది. కాబట్టి అడ్వాంటేజ్ ని ఫుల్ గా వాడుకుంటుంది.కానీ అసలైన సవాల్ 12వ తేదీ నుంచి మొదలవుతుంది. చిరంజీవి వెంకటేష్ కాంబోలో వస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు 12 వ తేదీ విడుదల కాబోతోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి బ్రాండ్ తో  కొన్ని సెంటర్లలో బాగానే పనిచేస్తుంది. రాజాసాబ్ సినిమా మూడు రోజుల వరకు బాగానే కలెక్షన్స్ రాబట్టిన మిగిలిన సినిమాతో స్క్రీన్స్  పంచుకోవలసి ఉంటుంది. దీనివల్ల కలెక్షన్స్ పైన కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి మరి ఈ రెండు సినిమాలలో టాక్ చాలా కీలకం


ఇక భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారి, అనగనగా ఒక రాజు వంటి చిత్రాలకు వాటి రేంజ్ తగ్గట్టుగానే స్క్రీన్లను సంపాదించుకోవడం కోసం మినీ యుద్ధమే చేయాల్సి ఉంటుంది. అలాగే విజయ్ నటిస్తున్న జననాయగన్ చిత్రాన్ని పివిఆర్ ఐమాక్స్ మద్దతు లభించడంతో మల్టీప్లెక్స్ లలో కోత తప్పడం లేదు. వీటన్నిటిని పరిశీలించిన డిస్ట్రిబ్యూటర్లు సైతం నిర్మాతలతో ఇంకా బేరాసాలు చేస్తున్నారనే విధంగా వినికిడి. నిర్మాతలు సైతం ఎంత ఆశిస్తున్నారో అంతకంటే తక్కువే వారి చేతికి అందేలా ఉందని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇందులో సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చి కొన్ని సినిమాలకు ఫ్లాప్ టాక్ వస్తే స్క్రీన్లు తగ్గించే విధంగా లోలోపల ఒప్పందాలు జరుగుతున్నట్లు వినిపిస్తున్నాయి. ఈ సంక్రాంతి పందెంలో బయ్యర్ల సైతం హడావిడి పడకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: