సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్లకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కాలంటే , అలాగే క్రేజీ సినిమాలలో ఛాన్స్ కొట్టేయాలి అంటే వరస విజయాలు కంపల్సరీ అనే వాదనను అనేక మంది వినిపిస్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లిన ముద్దు గుమ్మలకు కూడా ఆ తర్వాత వరుస పెట్టి ప్లాప్స్ వచ్చినట్లయితే వారికి స్టార్ హీరోల సినిమాలలో , భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు కూడా పెద్దగా దక్కవు. దానితో సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ క్రేజ్ వచ్చాక కూడా మంచి విజయాలు దక్కితేనే మంచి సినిమాలలో అవకాశాలు వస్తాయి అనే వాదనను అనేక మంది వినిపిస్తారు. ఇకపోతే ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలతో నటించిన ఓ ముద్దు గుమ్మ కెరియర్ ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉంది. గత కొంత కాలంగా ఆ బ్యూటీ నటించిన చాలా సినిమాలు వరుసగా ఫ్లాప్లు అవుతూ వస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ ఓ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్గా నటించింది.

సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. దానితో ఆ మూవీ మంచి విజయం సాధిస్తే ఆమె మళ్ళీ తిరిగి అద్భుతమైన ఫామ్ లోకి వస్తుంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. ఇంతకూ ఆ నటిమని ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మణులలో ఒకరు అయినటువంటి పూజా హెగ్డే. పూజా హెగ్డే గత కొంత కాలంగా వరుస ఆపజయాలను ఎదుర్కొంటుంది. 

తాజాగా ఈమె తమిళ స్టార్ హీరోలను ఒకరు అయినటువంటి దళపతి విజయ్ హీరోగా రూపొందిన జన నాయగన్ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 9 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ మంచి విజయం సాధిస్తే తిరిగి పూజ హెగ్డే అద్భుతమైన ఫామ్ లోకి వస్తుంది అని , లేదంటే ఈమె కెరియర్ మరింత కష్టాల్లోకి వెళుతుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: