బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రియాంక చోప్రా పేరు ప్రస్తుతం మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే మహేష్ బాబు, ప్రభాస్ లాంటి టాప్ స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది ప్రియాంక, ఇప్పుడు మరో తెలుగు స్టార్ హీరోతో బంపర్ ఛాన్స్ కొట్టేసిందన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.ప్రియాంక చోప్రా పేరు గతంలో కూడా పలుమార్లు తెలుగు సినిమా ఇండస్ట్రీతో లింక్ అవుతూ వచ్చింది. కానీ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైందన్న వార్త బయటకు రావడంతో ఆమె పేరు మరింతగా హైలైట్ అయింది. ఆ సినిమా సంబంధించిన అధికారిక పోస్టు విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా పేరు ట్రెండింగ్‌లో ఉంది.

అంతేకాదు, ఆ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ సందర్భంగా ప్రియాంక చోప్రా ప్రవర్తన, ఆమె వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్, స్టేజ్‌పై ఆమె చూపించిన కాన్ఫిడెన్స్ అన్నీ కూడా అభిమానులను, నెటిజన్లను ఆకట్టుకున్నాయి. దీంతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల్లో ఆమెపై ఆసక్తి మరింత పెరిగింది.ఇదే సమయంలో మరో పెద్ద వార్త కూడా వైరల్ అయింది. ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ సిరీస్ రెండో భాగంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించబోతోందన్న వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. వాస్తవానికి ‘కల్కి 2’లో మొదటగా దీపికా పదుకొనేని హీరోయిన్‌గా అనుకున్నారని, అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించి, ఆమె స్థానంలో ప్రియాంక చోప్రాను తీసుకున్నారనే టాక్ వినిపించింది. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా, ఈ వార్తలు అభిమానుల్లో భారీ ఆసక్తిని రేపాయి.

ఇంతటితో ఆగకుండా ఇప్పుడు ప్రియాంక చోప్రా ఖాతాలో మరో సూపర్ డూపర్ బంపర్ ఆఫర్ చేరిందన్న వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే… జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ప్రియాంక చోప్రా నటించబోతుందన్న వార్త. ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా హోరెత్తిపోతోంది.ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయాలని ముందుగా ప్లాన్ చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ చేతుల నుంచి జారిపోయి, అల్లు అర్జున్ చేతికి వెళ్లిపోయిందన్న వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

ఇప్పుడు ఆ ఖాళీని పూడ్చేందుకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్సినిమా చేయబోతున్నాడన్న వార్త బాగా ట్రెండ్ అవుతోంది. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ను చూపించిన సందీప్ రెడ్డి వంగా, ఈసారి ఎన్టీఆర్‌తో కలిసి ఒక షాకింగ్ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నాడట.ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రాను ఫైనల్ చేశారన్న టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే ఈ సినిమా, ఎన్టీఆర్ కెరీర్‌లోనే అభిమానులు ఊహించని విధమైన ట్విస్టులు, డార్క్ ఎమోషన్స్, పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్‌తో ఉండబోతుందంటున్నారు. ‘యానిమల్ పార్క్’ సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు దర్శకుడు సిద్ధమవుతున్నాడని సమాచారం.

ఈ కథ ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఒక టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందని, ఇప్పటివరకు ఆయన చేయని డిఫరెంట్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని టాక్. అందుకు తగ్గట్టుగానే హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా లాంటి ఇంటర్నేషనల్ స్టార్‌ను ఎంపిక చేయడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఈ అన్ని వార్తలతో మరోసారి ప్రియాంక చోప్రా పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. మహేష్ బాబు, ప్రభాస్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ వరుసగా టాలీవుడ్ టాప్ హీరోలతో ఆమె పేరు లింక్ అవుతుండటంతో, ప్రియాంక చోప్రా నిజంగానే తెలుగు సినిమాల్లో బిజీ స్టార్‌గా మారబోతోందా? అనే ప్రశ్నలు అభిమానుల్లో మొదలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: