టాలీవుడ్ హీరోలలో హీరో శ్రీకాంత్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కెరియర్ మొదట్లో సైడ్ క్యారెక్టర్గా పలు చిత్రాలలో విలన్ గా నటించిన శ్రీకాంత్ ఆ తర్వాత హీరోగా మారి ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించారు. ఇప్పటికి పలు చిత్రాలలో సహాయ నటుడిగా నటిస్తు బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ కెరియర్లో మహాత్మ సినిమా ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. కానీ ఈ సినిమా తర్వాత తన పరిస్థితి ఎలా ఉందో అనే విషయంపై తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టారు శ్రీకాంత్.


శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఒకానొక దశలో ఒక్క సినిమా విజయం అయితే చాలు, వరుసగా రెండు మూడు చిత్రాలు చేతిలో ఉండేవని గుర్తు చేసుకున్నారు. 2000 సంవత్సరంలో ఒక్క సినిమా హిట్ అయితే చాలు, రెండు మూడు చిత్రాలు కచ్చితంగా ఉండేవని.. కానీ తన 100 వ చిత్రం మహాత్మా సినిమా తర్వాత తన కెరీర్ చాలా దెబ్బతిందని తెలిపారు. మహాత్మ సినిమా తర్వాత సుమారుగా 25 చిత్రాలలో హీరోగా నటించిన ఏ ఒక్కటి కూడా హిట్ కాలేదు. ఆ సమయంలో చాలామంది తనని దారుణంగా కామెంట్స్ చేశారని, కొంతమంది టైం బాగాలేదు మరికొంతమంది ఫ్యాన్ బేస్ లేదని ఏవేవో కారణాలు చెబుతూ ఉండేవారు.


గతంలో ఏదైనా సినిమా బాగుంటే చాలు, నెమ్మదిగా పాజిటివ్ టాక్ పెరిగేది ఆలా ఎక్కువ కలెక్షన్స్  సాధించేవని, ప్రేక్షకులు కూడా సినిమాలు చూడడానికి ఎక్కువగా వచ్చేవారు. కానీ ప్రస్తుత ట్రెండ్ అయితే పూర్తిగా మారిపోయింది. మొదటి రోజే సినిమాకి హిట్ టాక్ రాకపోతే.. అదే రోజు మధ్యాహ్నానికి సినిమాలను థియేటర్ల నుంచి తీసేస్తున్నారంటూ తెలియజేశారు. సినిమా బాగాలేదని టాక్ వస్తే ఎవరూ కూడా థియేటర్లకు వెళ్లడం లేదని తెలియజేశారు. ఇలా ఎన్నో సవాళ్లను తాను ఎదుర్కొని నిలదొక్కుకోవాలని మొదటి నుంచి అనుకున్నాను ఆ ప్రయత్నాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నానని తెలిపారు శ్రీకాంత్.

మరింత సమాచారం తెలుసుకోండి: