టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలతో దూసుకుపోతున్న తరుణంలో, ఆయన అభిమానులకు కొంత నిరాశ కలిగించే వార్త ఒకటి ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) తో చిరంజీవి చేస్తున్న రెండో సినిమా మెగా 158 (Mega 158) షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. మొదట అక్టోబర్ 2025 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని సినిమా యూనిట్ భావించినా ... ప్రస్తుత పరిస్థితుల వల్ల ఈ ప్రాజెక్ట్ మరికొంత కాలం వెనక్కి వెళ్ళింది.


దర్శకుడు బాబీ ఇప్పటికే ఒక పవర్ ఫుల్ మాస్ కథను సిద్ధం చేసినప్పటికీ, దానిని మరింత మెరుగుపరచాలని చిరంజీవి సూచించినట్లు సమాచారం. స్క్రిప్ట్‌లో కొన్ని కీలకమైన మార్పులు చేయాలని, వినోదం మరియు మాస్ ఎలిమెంట్స్ సమపాళ్ళలో ఉండేలా చూడాలని మెగాస్టార్ కోరినట్లు తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం తన తదుపరి సినిమాలు విశ్వంభ‌ర‌, మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు సినిమాల‌ విడుదల పనుల్లో తలమునకలై ఉన్నారు.


ఈ క్ర‌మంలోనే మెగా 158 చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పుడు ఫిబ్రవరి లేదా మార్చి 2026 నుండి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా మాళ‌విక మోహనన్ పేరు వినిపిస్తోంది. అలాగే విలన్ పాత్ర కోసం ఒక పెద్ద స్టార్ నటుడిని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. వాల్తేరు వీరయ్యకు అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ లేదా తమన్ ఈ ప్రాజెక్టుకు సంగీతం అందించే అవకాశం ఉంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.


శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ప్రభావం :
మరోవైపు, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి చేయబోయే సినిమాపై కూడా భారీ హైప్ నెలకొంది. ఈ సినిమా పనులు కూడా వేగంగా జరుగుతుండటంతో, మెగాస్టార్ తన ప్రాధాన్యతను బట్టి ఏ సినిమాను ముందుగా పట్టాలెక్కిస్తారో అనే ఆసక్తి నెలకొంది. మెగా 158 కథ ఒక క్లాసిక్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని, చిరంజీవిని మునుపెన్నడూ చూడని రీతిలో బాబీ చూపించబోతున్నారని సన్నిహిత వర్గాల సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: