రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన రాజా సాబ్ మూవీ ఓ విషయంలో టాలీవుడ్ మూవీలలో టాప్ 10 లో స్థానాన్ని దక్కించుకుంది. అది ఏ విషయంలో అనుకుంటున్నారా ..? అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ను జరుపుకున్న మూవీల విషయంలో. ఇప్పటివరకు అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న టాప్ 10 మూవీలు ఏవి ..? అందులో రాజా సాబ్ మూవీ ఎన్ని కోట్లతో ఏ స్థానంలో నిలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.

అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ 617 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ను జరుపుకొని మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా , రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 450 యొక్క కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ను జరుపుకొని రెండవ స్థానంలో కొనసాగుతుంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా 370 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ను జరుపుకొని మూడవ స్థానంలో కొనసాగుతూ ఉండగా , ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 2 సినిమా 352 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్తో నాలుగవ స్థానంలో కొనసాగుతుంది. ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ మూవీ 345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్తో ఐదవ స్థానంలో కొనసాగుతూ ఉండగా , ప్రభాస్ హీరోగా రూపొందిన సాహో సినిమా 270 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్తో ఆరవ స్థానంలో కొనసాగుతోంది. ప్రభాస్ హీరోగా రూపొందిన ఆది పురుష్ మూవీ 240 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్తో ఏడవ స్థానంలో కొనసాగుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ మూవీ 221 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ తో ఎనిమిదవ స్థానంలో స్థానంలో కొనసాగుతూ ఉండగా , ప్రభాస్ హీరోగా రూపొందిన రాజా సాబ్ మూవీ 207 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్తో తొమ్మిదవ స్థానంలో కొనసాగుతుంది. ఇక ప్రభాస్ హీరోగా రూపొందిన రాదే శ్యామ్ మూవీ 202.80 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్తో పదవ స్థానంలో కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: