బాలనటి నుండి సెన్సేషనల్ డైరెక్టర్ వరకు!
గీతూ మోహన్ దాస్ అసలు పేరు గాయత్రి. ఈమె మలయాళీ కుటుంబానికి చెందిన వ్యక్తి. కేవలం నాలుగు ఏళ్ల వయసులోనే 'ఒన్ను ముట్టల్ పూజ్యం వరే' అనే సినిమాతో బాలనటిగా వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించడం విశేషం. ఆ తర్వాత కథానాయికగా కూడా రాణించిన గీతూ, 'అకలే' (Akale) సినిమాలోని నటనకు గానూ కేరళ స్టేట్ అవార్డును అందుకుంది.
అవార్డుల దర్శకురాలు.. ఇప్పుడు కమర్షియల్ వేట!
నటన నుంచి దర్శకత్వం వైపు మళ్లిన గీతూ, తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకుంది. ఆమె మొదటి సినిమా 'లయర్స్ డైస్' (Liar's Dice) జాతీయ స్థాయిలో రెండు అవార్డులను గెలుచుకోవడమే కాకుండా, ఆస్కార్ రేసులో ఇండియా తరపున అధికారిక ఎంట్రీగా నిలిచింది. ఆ తర్వాత నివీన్ పౌలీతో తీసిన 'మూథోన్' (Moothon) సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఇప్పటివరకు ఎక్కువగా ఆర్ట్ మరియు సీరియస్ డ్రామాలు తీసిన గీతూ, ఇప్పుడు యశ్‌తో కలిసి 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' అనే భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తోంది. రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకులే ఈ టీజర్ చూసి, "ఒక లేడీ డైరెక్టర్ ఇంత వయోలెంట్ అండ్ స్టైలిష్‌గా సినిమా తీయగలదా?" అని ఆశ్చర్యం వ్యక్తం చేశారంటే గీతూ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి, 'టాక్సిక్' సినిమాతో గీతూ మోహన్ దాస్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని యశ్ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇప్పుడు అందరి చూపు ఈ లేడీ డైరెక్టర్ పైనే ఉంది!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి