విజయ్ దేవరకొండ తక్కువ సమయంలోనే స్టార్ హీరో హోదాను పొందాడు.  అర్జున్ రెడ్డి సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయ్యాడు.  ఈ సినిమాను యూత్ ఎంతగా ప్రమోట్ చేసారంటే చెప్పక్కర్లేదు.  తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ రీమేక్ అయ్యింది.  


హిందీలో సూపర్ హిట్ కొట్టింది.  ఇప్పుడు ఈ యువ హీరో డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు.  దీంతో పాటు మరికొన్ని సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.  కాగా, విజయ్ తమ్ముడు ఆనంద్ దొరసాని సినిమా చేశాడు.  1980 నాటి తెలంగాణ పరిస్థితులను ఆధారంగా చేసుకొని సినిమా చేశారు.  


ఈ మూవీ జులై 12 న రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది.  విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.  అటు రాజశేఖర్ కుటుంబం కూడా తన కూతురు శివాత్మికను, దొరసాని సినిమాను ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు.  


ఇద్దరు సెలెబ్రిటీ కుటుంబాల నుంచి వస్తున్నారు కాబట్టి తప్పకుండా హైప్ ఉంటుంది.  ట్రైలర్ బాగుంది అనే టాక్ వచ్చింది.  పక్కా తెలంగాణా మూవీ కాబట్టి ఆంధ్రాలో ఎలా ఉన్నా తెలంగాణాలో మాత్రం ఆడుతుంది.  సినిమా బాగుంది అంటే అక్కడ కూడా ఆడొచ్చు.  ఎలా ఉంటుంది ఏంటి అన్నది జులై 12 న తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: