మహేష్ కెరీర్లో 25 వ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది.  మహర్షి రికార్డులు సాధించింది.  ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా సినిమాను తీర్చి దిద్దటంతో సఫలం అయ్యాడు వంశి పైడిపల్లి.  వంశి సినిమాలు బాగుంటాయి.  సినిమాకు రిచ్ నెస్ పేరుతో అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువగా ఖర్చు అవుతుంది.  


ఇదే వంశిలో ఉన్న మైనస్.  గతంలో ఊపిరి సినిమాకు మంచి పేరు వచ్చింది.  నాగార్జున మార్కెట్ కు తగ్గట్టుగా 40 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.  కానీ, సినిమా బడ్జెట్ ఎక్కువ కావడంతో నిర్మతకు లాభాలు రాలేదు.  దీంతో నిర్మాత కోసం మరో సినిమా చేయాల్సి వచ్చింది.  


అదే మహర్షి.  మహర్షి కోసం ముగ్గురు నిర్మాతలు పనిచేశారు.  దీంతో లాభాలు తక్కువ వచ్చినా సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  సినిమా సక్సెస్ తరువాత వంశితో మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చారు మహేష్.  ప్రస్తుతం మహేష్ 26 వ సినిమా చేస్తున్నాడు. 


దీనికి మహేష్ కూడా ప్రొడ్యూసర్.  దీనికోసం లిమిటెడ్ బడ్జెట్ ను కేటాయించారు.  ఆ బడ్జెట్ లోపలే సినిమా పూర్తి కావాలి.  అది అనిల్ రావిపూడికి పెట్టిన కండీషన్.  వంశితో మహేష్ చేస్తానంటున్న మూవీకి కూడా ఇలాగే బడ్జెట్ కండిషన్స్ పెడతారా లేదా అన్నది తెలియాలి.  ఎందుకంటే మహేష్ తన సినిమాల్లో తానూ కూడా ఇకపై భాగస్వామ్యం కావాలని అనుకుంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: