కన్నడ రాకింగ్ స్టార్ యశ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. కేవ‌లం కేజీఎఫ్ అనే ఒక్క సినిమాతో య‌శ్ ఇప్పుడు వ‌ర‌ల్డ్ వైడ్‌గా క్రేజీ హీరోగా మారిపోయాడు. క‌న్న‌డ సినిమా చ‌రిత్ర‌ను తర‌గ‌రాసి క‌న్న‌డ బాహుబ‌లిగా ప్ర‌శంస‌లు అందుకున్న ఈ సినిమా రికార్డుల వ‌ర్షం కురిపించేసింది. ప్ర‌స్తుతం య‌శ్ ఈ సినిమాకు సీక్వెల్‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. 


ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ యేడాది ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా కోసం ఇండియ‌న్ సినిమా అభిమానులు అంద‌రూ క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే యశ్ ఫ్యామిలీ లైఫ్ గురించి చాలా మందికి తెలియ‌దు.


య‌శ్ భార్య ఎవ‌రో కాదు హీరోయిన్‌. అందాల కథానాయిక రాధిక పండిట్ ని పెళ్లాడాడు. ఈ జంటకు ఇప్ప‌టికే ఓ ఆడ పిల్ల పుట్టింది. కూతురు పుట్టిన నెల‌లోనే  `కేజీఎఫ్` రిలీజై బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడం విశేషం. ఆ మూమెంట్ ఎప్పుడు గుర్తుండేలా యశ్ - రాధికా పండిట్ దంపతుల‌కు ఓ గిఫ్ట్ వ‌చ్చింది. రాధికా పండిట్ మేకప్ మేన్ ఆ జంట కూతురు చిట్టి పాదాలు లేలేత చేతుల గుర్తులు తీసుకుని వాటికి ఫోటో ఫ్రేమ్ ని రూపొందించి కానుకగా ఇచ్చారు. 


ఈ గిఫ్ట్ త‌మ జీవితంలో మ‌ర్చిపోలేని అద్భుత‌మైన గిఫ్ట్ అని వీళ్లు మురుసుకుంటున్నారు. రాధిక పండిట్ ప్రస్తుతం రెండోసారి ఫ్రెగ్నెన్సీతో ఉన్నారు. కేజీఎఫ్ 2 రిలీజ్ టైమ్ కి మరో గుడ్ న్యూస్ చెబుతాడనే ఫ్యాన్స్ భావిస్తున్నారు. మ‌రి ఈ సారి ఈ దంప‌తుల‌కు జూనియ‌ర్ య‌శ్ పుడ‌తాడా ?  లేదా జూనియ‌ర్ రాధిక పుడుతుందా ? అన్న‌ది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: