మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్.  వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రేయ్ సినిమాలో నటించాడు..కానీ ఆ మూవీ కన్నా ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా రిలీజ్ అయ్యింది.  ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది..ఆ తర్వాత రెజీనా, సాయిధరమ్ తేజ్ జంటగా వచ్చిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది.  అయితే ఈ రెండు మూవీల్లో సాయిధరమ్ తేజ్ డ్యాన్స్, ఫైట్స్ మెగా ఫ్యాన్స్ కి ఎలా ఉండాలో అలా కనిపించాడు.  అదే సమయంలో రేయ్ సినిమా రిలీజ్ అయినా పెద్దగా సక్సెస్ కాలేదు.  తర్వాత సుప్రీమ్ సినిమా మంచి సక్సెస్ సాధించింది.


ఆ తర్వాత సాయిధరమ్ నటిస్తున్న సినిమాలు వరుసగా ఫెయిల్ అయ్యాయి.  ఇటీవల రిలీజ్ అయిన చిత్రలహరి కాస్త పరవాలేదు అనిపించింది.  ఇక సినీ సెలబ్రెటీలు రీల్ లైఫ్ లోనే కాదు..రియల్ లైఫ్ లో కూడా ప్రేమలో పడుతుంటారు...విడిపోతుంటారు ఈ విషయం జగమెరిగిన సత్యం.  ఇక  సినిమా ఇండస్ట్రీలో డేటింగ్ రూమర్స్ అనేవి వినిపిస్తూనే ఉంటాయి. హీరోలు ఎవరైనా హీరోయిన్లతో సన్నిహితంగా ఉన్నా.. కలిసి రెండు, మూడు సినిమాలు చేసినా.. వారిద్దరి మధ్య ఏదో ఎఫైర్ నడుస్తుందని వార్తలు వస్తుంటాయి. ఆ మద్య సాయిధరమ్, రెజీనా మద్య ప్రేమాయణం నడుస్తుందని తెగ వార్తలు వచ్చేవి..కానీ అవన్నీ ఒట్టి రూమర్లు అని ఇద్దరూ కొట్టి పడేశారు.   


తాజాగా తన ప్రేమ, బ్రేకప్ విషయాలపై స్పందించాడు ఈ హీరో. తన లైఫ్ లో ఓ అమ్మాయి ఉండేదని కానీ తనకు దూరమైందని చెప్పుకొచ్చాడు. కాలేజ్ డేస్ లో సాయిధరమ్ తేజ్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడట. తనకు సిని పరిశ్రమతో  ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు.  కాలేజ్ పూర్తయిన తరువాత సాయి ధరం తేజ్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఐదేళ్ల సమయం పట్టింది. 


ఇండస్ట్రీలో నేను హీరోయిన్లతో చాలా సన్నిహితంగా ఉంటారు..కేవలం స్నేహితుడిగానే, కానీ చాలా మంది ఈ విషయంలో తప్పుగా అర్థం చేసుకొని ఏవేవో అర్ధం చేసుకుంటారు.  ప్రస్తుతం సాయి ధరం తేజ్ ఇంట్లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. కానీ తను సెటిల్ అయిన తరువాతే పెళ్లి చేసుకుంటానని తన తల్లికి చెప్పేశాడట. ప్రస్తుతం ఈ హీరో మారుతి దర్శకత్వంలో 'ప్రతిరోజు పండగే' అనే సినిమాలో నటిస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: