ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘సాహో’ సినిమా ఇటీవల మూడు భాషలతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విడుదల అయ్యింది. అయితే సినిమాకి మొట్టమొదటి రోజే ఫ్లాప్ టాక్ రావడంతో చాలావరకు నష్టాలు చూశారు సినిమా నిర్మాతలు. ఇటువంటి నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో వారే నష్టాలు చూసిన సాహో ఎఫెక్ట్ చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమా పై పడినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. సైరా సినిమా చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా. ఈ క్రమంలో సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విడుదల చేయాలని సినిమా ప్రారంభం కాకముందే నిర్మాత రామ్ చరణ్ భావించి బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఇంకొంతమంది నీ సినిమాల్లోకి తీసుకోవడం జరిగింది.


ఇదిలా ఉండగా ఇటీవల భారీ బడ్జెట్‌తో రిలీజ్ అయిన ‘సాహో’ అనుకున్న అంచనాల్ను అందుకోలేకపోవడంతో ఇప్పుడు ‘సైరా’ ఓవర్సీస్ రైట్స్ రూ. 20 కోట్లకు అమ్మాల‌ని చరణ్ ఎంతగా ప్రయత్నాలు చేసినా కొనేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో చివరకు 15 కోట్లకు ఫైనల్ చేసినట్లు సమాచారం. మొత్తం మీద సాహో సినిమా పరాజయం ప్రభావం చిరంజీవి నటించిన సైరా సినిమా కి భారీగానే పడింది అని ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది అభిప్రాయపడుతున్నారు.


అయితే మరోపక్క గత కొంత కాలం నుండి తెలుగు సినిమా రంగానికి చెంది స్టార్ హీరోల సినిమాలు ఓవర్సీస్ లో అనుకున్నంతగా కలెక్షన్లు రాబట్టలేకతున్నాయని 'మహర్షి', 'సాహో' సినిమా కలెక్షన్లు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి అంటున్నారు ట్రేడ్ వర్గాలకు చెందినవారు. దీంతో ఓవర్సీస్లో సినిమాని కొనడానికి బయ్యర్లు ముందుకు రావడం లేదని ఇందువల్లనే 'సైరా' సినిమా ధర చాలా తక్కువ పలికిందని మరికొంతమంది ఇండస్ట్రీకి చెందిన వారు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్టార్ హీరోల సినిమాలను ఓవర్సీస్లో కొనటానికి బయ్యర్లు తెగ వణికిపోతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: