టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ని సంపాదించిన విషయం తెలిసిందే. ప్రియాంక అరుళ్ మోహన్ తొలిసారి టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయిన ఈ సినిమాకు వెరైటీ సినిమాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించడం జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ని సంపాదించడంతో కలెక్షన్స్ ఎంతో అద్భుతంగా వస్తాయని అందరూ భావించారు. 

అయితే ప్రస్తుతం ఈ సినిమా పరిస్థితి ఊహించిన దానికి భిన్నంగా నడుస్తున్నట్లు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇప్పటికే ఓవర్సీస్ సహా పలు ప్రాంతాల్లో ఈ సినిమాకు డ్రాప్స్ పెరిగాయని, ఇక టాలీవుడ్ సినిమా అడ్డగా భావించే నైజాంలో కూడా ఈ సినిమా చతికిలపడ్డట్లు చెప్తున్నారు. నిజానికి ఈ సినిమాకు నైజాంలో రూ.7.50 కోట్లకు బిజినెస్ జరిగిందని, అయితే ఇప్పటివరకు ఈ సినిమా కేవలం రూ. 5.66 కోట్లు మాత్రమే వసూలు చేసిందని అంటున్నారు. ఇక రేపు వాల్మీకి, బందోబస్త్ సినిమాలు కూడా రిలీజ్ కానుండడంతో, రాబోయే రోజుల్లో మొత్తంగా చూసుకున్నా ఈ సినిమా రూ.6.50 కోట్లకు మించి వసూలు చేయడం ఖచ్చితంగా కష్టమనే అంటున్నారు. దీనిని బట్టి ఈ సినిమా నైజాంలో బ్రేక్ ఈవెన్ ని అందుకునే పరిస్థితులు కనపడడం లేదని, 

దీనితో అక్కడి డిస్టరుబుటర్లకు నష్టాలు తప్పవని అంటున్నారు. అయితే ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఇటీవల నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన జెర్సీ సినిమా కూడా మంచి టాక్ సాధించి, నైజాంలో ఏకంగా రూ.10 కోట్ల మేర కలెక్షన్ ని కొల్లగొట్టడం విశేషం. ఇక గ్యాంగ్ లీడర్ సినిమా ఓవర్ ఆల్ కలెక్షన్స్ ప్రకారం ఇప్పటివరకు రూ.17.50 కోట్లు మాత్రమే వసూళ్లు అందుకుందని, అయితే బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలంటే మరొక రూ.12 కోట్లవరకు రాబట్టవలసి ఉందని చెప్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది గ్యాంగ్ లీడర్ కి చాలావరకు అసాధ్యంగానే కనపడుతోంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: