ముకుంద సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, తొలి సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడం అతడికి కాస్త నిరాశను మిగిల్చింది. అయితే ఆ తరువాత ఆయన నటించిన కంచె, ఫిదా, తొలిప్రేమ వంటి సినిమాలు వరుణ్ కు కెరీర్ పరంగా మంచి సక్సెస్ లు అందించాయి. ఇకపోతే ప్రస్తుతం ఆయన హీరోగా తెరకెక్కిన వాల్మీకి సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ని సంపాదించినట్లు తెలుస్తోంది. మాస్ సినిమాలను తనదైన ఆకట్టుకునే కమర్షియల్ శైలిలో తెరకెక్కించగల హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్, 

గోపి అచంటలు నిర్మించడం జరిగింది. జిగర్తాండ అనే తమిళ సినిమాకు అధికారిక రీమేక్ గా హరీష్ తెరకెక్కించిన ఈ సినిమాలో వరుణ్ తన మాస్ పెర్ఫార్మన్స్ తో ఇరగీసినట్లు సమాచారం. కెరీర్ లో తొలిసారి గద్దలకొండ గణేష్ అనే ఊర మాస్ క్యారెక్టర్లో నటించిన వరుణ్, లుక్స్ స్టయిల్, డైలాగ్స్ ఇలా అన్నిట్లోనూ అదరగొట్టి థియేటర్ లోని ప్రేక్షకుడికి మంచి వినోదాన్ని పంచినట్లు చెప్తున్నారు. ఇప్పటివరకు పలు సినిమాల్లో సెటిల్ పెర్ఫార్మన్స్ మాత్రమే చేసిన వరుణ్, ఈ సినిమాతో తనలోని పూర్తి స్థాయి నటుడిని బయటకు తీసి ప్రేక్షకుల ముందుకు వచ్చి శభాష్ అనిపించుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ముఖ్యంగా తెలంగాణ యాసలో అతడు పలికిన డైలాగ్స్ కు థియేటర్ లో విజిల్స్ అదిరిపోతున్నాయని, ఇక మెగా ఫ్యాన్స్ అయితే ఎంతో పండుగ చేసుకున్నటున్నారు అని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాలో తన స్టన్నింగ్ పెర్ఫార్మన్స్ తో వరుణ్, టాలీవుడ్ స్టార్ హీరోల సరసన చేరిపోయినట్లే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకరకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లినప్పటికీ ఆయన స్థానాన్ని వరుణ్ పర్ఫెక్ట్ గా భర్తీ చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. సో మొత్తానికి ఈ వాల్మీకి రూపంలో వరుణ్ మరొక సూపర్ హిట్ కొట్టాడన్నమాట.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: