ముకుందా సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యిన  మెగా హీరో వరుణ్ తేజ్.. ఆ సినిమా తరువాత లోఫర్ సినిమాలో నటించారు. మొదటి సినిమా హిట్ అయినంతగా రెండో సినిమా హిట్ అవ్వలేదని అందరికి తెలుసు. కాకపోతే రెండో సినిమాలో కొంచం కొత్త లుక్ తో కనిపించాడనే టాక్ అందుకున్నాడు. ఆ సినిమా తరువాత వచ్చిన ఫిదా సినిమా తో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలను ఫిదా అయ్యేలా చేసాడు. అలా వరుణ్ ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు. తీసింది కొన్ని సినిమాలే అయిన కూడా  ఈ అబ్బాయి బాగ్ ఫామ్ లో ఉన్నాడు. 


మొన్న సంక్రాంతి కానుకగా వచ్చిన మల్టీస్టారర్ చిత్రం ఎఫ్ 2 సినిమా మాములుగా హిట్ అవ్వలేదు.. ఈ సంవత్సరం మొదట్లో అత్యంత భారీ కలెక్షన్లతో దూసుకుపోయిన చిత్రంగా పేరును సంపాదించింది. ఆ సినిమా తరువాత వరుణ్ తేజ్ నటించిన సినిమా వాల్మీకి అలియాస్ గద్దలకొండ గణేష్. ఆ సినిమా మొత్తంలో వరుణ తేజ్ విలన్ గా కనిపిస్తాడు. ఆ సినిమాలో పూజాహెగ్డే వరుణ్ కు జోడిగా జతకట్టింది. 


ఆ సినిమా విషయానికొస్తే..  ఆ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ బాగుందనే టాక్ వినపడుతుంది.ఈ సినిమా పాటలు మాత్రం సూపర్ అని
అంటున్నారు. డైలాగులు కూడా బాగానే ఆకట్టుకున్నాయి. మరి మొత్తం సినిమా విషయానికొస్తే స్టోరీ నీ కొంచం పెంచారు దానితో సినిమా హిట్ లెవల్ తగ్గింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 14 రీళ్ల ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను నిర్మించారు. 


ఇకపోతే ఈ సినిమాలో వరుణ్ బాబు పెద్దనాన్న చిరంజీవి లాగ ఉన్నారని చాలా మంది సినీ ప్రముఖులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు అంటున్నారు. ఎటు చుసిన కూడా మొత్తానికి ఫస్ట్ ఆఫ్ హరీష్ మార్క్ కనిపించేలా తెరకెక్కించారని అంటున్నారు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతానికి మిశ్రమ కలెక్షన్స్ తో ను, మిశ్రమ టాక్ తోను దూసుకుపోతుంది. మరి సినిమా పరిస్థితి గ్యాంగ్ లీడర్ లాగా కొద్దీ రోజులు థియేటర్లలో ఆడుతుందా, లేక సాహో లాగా ఒక్క రోజుకే టాలీవుడ్ లో డీలా పడుతుందో అన్న విషయం తెలియాల్సి ఉంది .. 


మరింత సమాచారం తెలుసుకోండి: