అక్కినేని సమంత అంటే నాగార్జునకు విపరీతమైన ఇష్టం. అయితే అలాంటి సమంత నాగార్జున ప్రమోట్ చేస్తున్న డిటర్జెంట్ పౌడర్ కు పోటీగా అదే తరహాకు చెందిన మరో డిటర్జెంట్ బార్ ను ప్రమోట్ చేయడమే కాకుండా నాగార్జున తన యాడ్ లో చెప్పిన మాటలకు కౌంటర్ గా సమంత మాటలు ఉండటం చాలామందికి నవ్వు తెప్పిస్తోంది.

నాగార్జున తన డిటర్జెంట్ పౌడర్ ను ఎండార్స్ చేస్తూ తాను ప్రమోట్ చేస్తున్న వాషింగ్ పౌడర్ ను ఒక ప్రముఖ లేబరేటరీలో టెస్ట్ చేసారని చెపుతూ ‘ముందు వాడి చూడండి ఆ తరువాతే నమ్మండి’ అంటాడు. అయితే సమంత తన వాషింగ్ పౌడర్ యాడ్ లో దీనికి రివర్స్ గా మాట్లాడుతుంది. 

తన డిటర్జెంట్ ను లక్షలాది మంది ఇళ్ళల్లో ఇప్పటికే వాడుతున్న పరిస్థితులలో మళ్ళీ తన వాషింగ్ పౌడర్ ను లేబ్ లో టెస్ట్ చేయవలసిన పని ఏమిటి అంటూ తన యాడ్ లో ప్రశ్నలు వేస్తోంది. దీనితో సమంత యాడ్ ను చూసినవాళ్ళు ఆమె మాటలు నాగార్జున యాడ్ లోని మాటలకు కౌంటర్ గా ఉన్నాయా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

గతంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ లు రెండు వేరువేరు కూల్ డ్రింక్స్ కోసం యాడ్స్ చేసినప్పుడు ఇలా ఒకరి యాడ్ లోని విషయాలను మరొకరు టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసుకున్న సందర్భాలు లేవనీ మరి అలాంటిది ఇప్పుడు సమంత నాగ్ యాడ్ ని ఎందుకు టార్గెట్ చేసింది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయాలు అన్నీ సమంతకు తెలిసి జరిగినా తెలియక జరిగినా ప్రస్తుతం బుల్లితెర పై జరుగుతున్న సమంత నాగ్ ల డిటర్జెంట్ పౌడర్ యాడ్ వార్ బుల్లితెర ప్రేక్షకులకు మంచి జోష్ ను కలిగిస్తూ ఆనందాన్ని షేర్ చేస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: