స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన బిరుదుకు తగ్గట్టే బిహేవ్ చేస్తూంటాడు. చేసే ప్రతి సినిమాలో తన క్యారెక్టర్ స్టైలిష్ గా ఉండేలా చూసుకుంటాడు. అందుకోసం ఎలాంటి మేకోవర్ కైనా సిద్ధపడతాడు. రియల్ లైఫ్ లో కూడా.. ఇంట్లోని ఇంటీరియర్, కొత్త కారు, ఫాల్కన్ అని పేరు పెట్టుకున్న తన కారవాన్ అయినా.. ఏదైనా స్టైలిష్ గా ఉండాలనుకుంటాడు. సోషల్ మీడియాలో కూడా తన స్పెషాలిటీ చూపిస్తూంటాడు. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ప్రస్తుతం చేసిన ఓ పోస్ట్ కూడా అంతే స్పెషల్ గా ఉంది.

 


ఈ రోజు వరల్డ్ డాటర్స్ డే సందర్భంగా తన ముద్దుల కూతురు ‘అర్హ’తో కలిసి చేసిన స్టైలిష్ వీడియోను పోస్ట్ చేసాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరక్షన్ లో అల.. వైకుంఠపురం సినిమా చేస్తున్నాడు. ఇటివల విడుదలైన ఆ సినిమా టీజర్ లో తాను చెప్పిన డైలాగులను తన గారాలపట్టితో చెప్పించాడు. ముద్దు ముద్దుగా అర్హ చెప్పిన డైలాగులతో బన్నీ మురిసిపోతున్న వీడియోను పోస్ట్ చేశాడు. “ఏంట్రా గ్యాప్ ఇచ్చావ్..” అని బన్నీ అంటే.. ‘ఇవ్వలా.. వచ్చింది’ అంటూ అర్హ చక్కగా చెప్పింది. “కూతుళ్లుంటే ప్రపంచమెంతో అందంగా కనిపిస్తుంది. డాటర్స్ డే సందర్భంగా కూతుళ్లున్న తండ్రులందరకీ శుభాకాంక్షలు” అంటూ తన ఇన్ స్టా వాల్ లో రాసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియోకి నెటిజన్ల నుంచి, మెగా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తన కూతురుతో చేసే సరదా అల్లరిని తన ఇన్ స్టాలో అప్పుడప్పుడూ రిలీజ్ చేస్తూనే ఉంటాడు.

 


ప్రస్తుతం బన్నీ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య నాలుగు మిలియన్లకు చేరుకుంది. దీనిపై కూడా బన్నీ స్పందించాడు. ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. 2020 సంక్రాంతికి అల.. వైకుంఠపురం సినిమా విడుదల కానుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: