మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా సందడి మొదలైపోయింది. నిన్న జరిగిన ఈవెంట్ కు భారీగా తరలివచ్చిన మెగా అభిమాన గణం మెగాస్టార్ ఫ్యాన్ బేస్ స్థాయి చూపించారు. తమ అభిమాన హీరోను అత్యంత పవర్ ఫుల్ పాత్రలో ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అనే ఉత్సాహం వారిలో కనపడింది. ఈ సినిమా కోసం అభిమానులే కాకుండా ఎందరో సెలబ్రిటీలు ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ సినీ సెలబ్రిటీలు చిరంజీవికి, సినిమాకు విషెష్ చెప్తున్నారు.


ఈ లిస్టులో టాలీవుడ్ డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ కూడా చేరిపోయాడు. ఇటివల విడుదలైన సైరా ట్రైలర్ పై స్పందించాడు. 'కొన్నేళ్ల క్రితం చరణ్ నాతో ఒక విషయం చెప్పాడు. డాడీకి మోస్ట్ మెమరబుల్ గా ఉండే సినిమా తీయాలి, మనందరం గర్వంగా ఫీల్ అయ్యే సినిమా తీయాలి అని. ఇప్పుడు సైరా.. ట్రైలర్ చూశాక నాకు చరణే గుర్తొచ్చాడు. సినిమాని ఇంత గ్రాండియర్ గా, అద్భుతమైన విసువల్స్ తో చరణ్ తీసాడు. సురేందర్ రెడ్డి బాగా తెరకెక్కించాడు. అన్నయ్య చిరంజీవి గురించి చెప్పాలంటే.. ఎనర్జీలో చిరంజీవి గారిని కొట్టేవాడు మళ్లీ పుట్టడు. మెగాస్టార్ అభిమానిగా సైరా.. పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. లవ్ యూ' అంటూ చిరంజీవిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇప్పటికే రాజమౌళి, వినాయక్, కొరటాల శివ.. ఇలా టాలీవుడ్ లోని చాలామంది ప్రముఖులు సైరా.. కోసం చూస్తున్నారు. చరణ్ ఈ స్థాయిలో సినిమా తీయడం టాలీవుడ్ లో పెద్ద చర్చనీయాంశమైంది.


నిజానికి చిరంజీవి 150వ సినిమా చేయాలని పూరి జగన్నాధ్ ఆశపడ్డాడు. ఆటో జానీ అనే కథను కూడా చిరంజీవికి వినిపించాడు. ఫస్టాఫ్ నచ్చిన చిరంజీవికి సెకండాఫ్ నచ్చకపోవడంతో ఆ సినిమా తెరకెక్కలేదు. అయితే దీనిపై పూరీ ఓసారి 'అన్నయ్యతో 150 కాకపోతే.. 151.. అదీ కాకపోతే 152వ సినిమా చేస్తా. మొత్తానికి చిరంజీవి గారితో సినిమా చేస్తా' అని ప్రకటించాడు. తన కోరిక తీరాలంటే మంచి కథతో చిరంజీవిని ఒప్పించాల్సిన బాధ్యత పూరీదే.

మరింత సమాచారం తెలుసుకోండి: