సినిమాలలో నటిస్తూ సెలెబ్రెటీలుగా కొనసాగుతున్న సినీ తారలు కూడా అంగ వైకల్యంతో భాదపడుతున్నారు. ఇంతకీ ఏ సెలెబ్రెటీకి ఏ లోపం ఉందొ ఇప్పుడు చూద్దాము.. అంతేకాకుండా ఆ లోపల వల్ల వారికి ఎప్పుడైనా ఇబ్బంది కలిగిందేమో అన్న విషయాలను కూడా తెలుసుకుందాము. 

రానా : 

లీడర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన దగ్గుపాటి వారబ్బాయి రానా.. ఆ తరువాత వచ్చిన బాహుబలి సినిమాతో ప్రపంచ ఖ్యాతిని పొందారు. ఇకపోతే ఈ హీరో కు ఒక కన్ను కనపడదట. అందుకే ఎప్పుడు బయటకొచ్చినా కూడా గ్లాసెస్ వాడతారట. ఆ విషయాన్నీ స్వయంగా ఆ హీరోనే ఒక సందర్భంలో వెల్లడించారు. 

నితిన్ : 
జయం వంటి హిట్ సినిమాలలో నటించిన హీరో నితిన్ తెలుగులో ఎన్నో సినిమాలలో నటించారు. కొన్ని సినిమాలు హిట్ అవ్వగా, మరికొన్ని సినిమాలు మాత్రం అతనికి ఫ్లాప్ ను రుచి చుపించాయ. అయితే, ఈ హీరో కు కూడా ఒక లోపం ఉందట అదేంటంటే నితిన్ కు కొంచం నత్తి ఉందట. అందుకే నితిన్ సినిమాలకు హీరో శివాజీ డబ్బింగ్ చెప్తూ వస్తున్నాడు. 

ఆలీ :
తెలుగు టాప్ కమెడియన్లలో ఒకరు ఆలీ.. బ్రహ్మానందం తర్వాత కమెడియన్ అంటే అందరు ఆలీ పేరు చెప్తారు. ఆలీకి కూడా నితిన్ లాగే నత్తి ఉంది. ఆ విషయం చాలా మందికి తెలియదు కూడా.. ఆ లోపాన్ని తెలియకుండా చాలా కస్టపడి మరి కవర్ చేసుకుంటూ వస్తున్నారు. 

అభినయ :
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి హిట్ సినిమాలలో నటించిన అభినయ అందరికి తెలిసే ఉంటుంది. ఆమెకు చెవుడు, మూగ. అయితే ఆమె చేసే సన్నివేశాలు అందరిని ఏడిపిస్తూ వస్తాయి. ఆమెకు వాళ్ళ అమ్మ డబ్బింగ్ చెప్తుంది. 

సుధా చంద్రన్ : 
మయూరి సినిమా చాలా మందికి తెలియక పోవచ్చు. ఆ సినిమా గ్రేట్ డ్యాన్సర్ సుధా చంద్రన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. ఆ సినిమాలో ఆమె హీరోయిన్ కూడా. ఆమెకు ఒక కాలు లేదు. యాసిడెంట్లో ఒక కాలును కోల్పోయింది. ఆ తర్వాత ఆమె జైపూర్ కాలును పెట్టుకొని మరి ఎన్నో షోలలో తన డ్యాన్స్ తో అందరిని కట్టిపడేసింది. 
ఇలా మనకు తెలియకుండా చాలా మందికి చాలా లోపాలున్నాయి. అయిన కూడా టాలెంటును నమ్ముకున్న వీరు ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: