టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిరకాల వాంఛ గా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా రెండు రోజుల క్రితం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రాయలసీమ ప్రాంతానికి చెందిన స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ నటన హైలైట్ గా నిలిచింది. ఆకట్టుకునే కథ, కథనాలు, మంచి బ్యాక్ డ్రాప్ ఉన్నప్పటికీ దర్శకుడు సురేందర్ రెడ్డి, సైరాను ప్రేక్షక నాడి పట్టుకునే విధంగా తీయలేదనే విమర్శలు వినపడుతున్నాయి. తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన సైరా, రెండవ రోజు చాలా చోట్ల డ్రాప్స్ చవిచూడవలసి వచ్చిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 

ఇకపోతే నిన్న తన భార్య మరియు పిల్లలతో కలిసి మహేష్ బాబు ఇటీవల నిర్మించిన ఏఎంబి సినిమాస్ మల్టిప్లెక్స్ కు విచ్చేసిన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కుటుంబ సమేతంగా సైరాని స్పెషల్ గా వీక్షించడం జరిగింది. ముందుగా ఏఎంబి సినిమాస్ ప్రత్యేకతను, అక్కడి సినిమా ఎక్స్పీరియన్స్ ని పొగిడిన బన్నీ, ఆ తరువాత సైరాపై తన అభిప్రాయాన్ని అక్కడి కొందరు సన్నిహితులతో పంచుకున్నట్లు తెలుస్తోంది. తనకు సైరా సినిమా ఎంతో నచ్చిందని, ఇటీవల రాజమౌళి గారు తెరకెక్కించిన బహుబలి సిరీస్ లోని రెండు సినిమాల మాదిరిగా, ఈ సైరా కూడా ఒక హిస్టారికల్ బ్లాక్ బస్టర్ గా మన టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోతుందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారట. 

ఇక సినిమాలో మెగాస్టార్ గారు తన సహజ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసారని, అలానే అమితాబ్ సహా పలువురు ఇతర నటీనటులందరూ కూడా ఎంతో అద్భుతంగా నటించారని అన్నారట. ఇక ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు తనకు హాలీవుడ్ ని సినిమాలను తలపించాయని, ఇక సినిమాలోని విజువల్స్, సెట్టింగ్స్, యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే ఎంతో అదిరిపోయాయని అన్నారట. ఇక ముఖ్యంగా తనకు ప్రీ ఇంటర్వెల్ ఫైట్, ప్రీ క్లైమాక్స్ యుద్ధం సీన్, ఎమోషనల్ క్లైమాక్స్ సీన్ వంటివి బాగా నచ్చాయని బన్నీ చెప్పినట్లు తెలుస్తోంది.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: