నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా కాగా కత్తి పట్టి శత్రువుల తలలు నరిగే సన్నివేశానిలోని బాలయ్య గెటప్ ను రివీల్ చేస్తూ చిత్రబృందం దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం బాలయ్య కత్తి మాత్రం వదట్లేదు అని కామెంట్లు పెడుతున్నారు. ఇక `జైసింహా` వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ఈ హిట్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ చిత్రం తరువాత షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరుగనుంది. అయితే ఈ షెడ్యూల్ లో ఫుల్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ కూడా వేస్తున్నారట. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనపడతారు. కాగా ఇటీవల విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వచ్చింది. మరి ఈ రోజు విడుదల అయిన పోస్టర్ కి ఏ రేంజ్ లో ఆదరణ దక్కుతుందో చూడాలి. మొత్తానికి బాలయ్య లుక్స్ అండ్ గెటప్స్ తోనే సినిమా పై అంచనాలు పెంచేశాడు.
ఇక ఈ చిత్రంలో రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న బాలయ్య సరసన సోనాల్ చౌహాన్ అండ్ వేదిక హీరోయిన్లుగా నటించనున్నారు. అయితే వేదిక మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది. అలాగే ఓ కీలకమైన పాత్రలో నమితను కనిపించనుంది. నమితది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర.. ముఖ్యంగా సినిమాలో బాలయ్యకి విలన్ గా కనిపించనుంది. ఇప్పటికే సింహా సినిమాలో బాలయ్య సరసన నమిత నటించింది. ఇక ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు పవర్ ఫుల్ విలన్ గా నటించబోతున్నాడు. బ్లాక్‌బస్టర్ `లెజెండ్` తర్వాత బాలకృష్ణ, జగపతిబాబు కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందుతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత, సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. `జైసింహా` వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఈ హిట్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రమిది. అలాగే ఈ చిత్రానికి 'రూలర్' అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.