సౌత్ ఇండియన్ సినిమాల్లో కమల్ హాసన్ లాంటి విలక్షణతను చూపించే నటులలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒకరు. ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా తన సినిమాలను రిలీజ్ చేస్తూ క్రేజ్ సంపాదిస్తున్న మోహన్ లాల్ ప్రస్తుతం మలయాళంలో తీస్తున్న సినిమా ఒడియన్. శివకుమార్ మీనన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్ లుక్ ఎలా ఉండబోతుందో ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.


సీనియర్ స్టార్ హీరోయిన్ అయిన మోహన్ లాల్ ఇప్పటి స్టార్ హీరోలకు ఏమాత్రం తీసి పోడని చెప్పొచ్చు. అంతెకాదు ఒడియన్ ఫస్ట్ లుక్ లో తన వయసు పాతికేళ్లా అనేలా అదిరిపోయే గెటప్ లో కనిపించి అందరిని సర్ ప్రైజ్ చేశాడు మోహన్ లాల్. ఒడియన్ మోహన్ లాల్ లుక్ అదరగొడుతుందంటే నమ్మాలి. 


ట్రైబల్ కు సంబదించిన ఓ తెగ కథతో ఈ సినిమా తెరకెక్కుతుందట. మేటి స్టార్స్ ను సైతం ఆశ్చర్య పరచేలా ఉన్న మోహన్ లాల్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. నటనలో ఏమాత్రం ఛాన్స్ దొరికినా అల్లుకుపోయేలా పాత్ర దాని ప్రాముఖ్యతలతో మోహన్ లాల్ అయ్యబాబోయ్ అనేలా ఒడియన్ లుక్ ఉంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: