బ్యూటీ విత్ బ్రెయిన్ అనే మాటను సాధారణంగా వింటూ ఉంటాం. హీరోయిన్ రాధికా ఆప్టే ని చూస్తే మాత్రం బ్యూటీ విత్ టాలెంట్ అని ఖచ్చితంగా అనాలేమో! ఎందుకంటే ఎటువంటి పాత్రలోనైనా పరకాయప్రవేశం చేసి, ఆ సన్నివేశానికి ఎలా అవసరమో అందుకు అనుగుణంగా, అవలీలగా నటిస్తుంది.
ఈ అమ్మడు ఈ మధ్య బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తూ తరచూ వార్తలలో నిలుస్తుంది. మొన్న ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై, నిన్న బికినీపై బోల్డ్ గా మాట్లాడిన ఈమె తాజాగా మరోసారి ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ నటి నేహా దూపియా నిర్వహిస్తున్న ఓ టాక్ షో కు ముఖ్య అతిధిగా వచ్చిన రాధికా ఆప్టే సౌత్ స్టార్ హీరో చెంప పగలగొట్టానని చెప్పి ఆసక్తికర వాఖ్యలు చేసింది.
ఆ షో లో తన కెరీర్లో మొదట నిలదొక్కుకునే టైములో జరిగిన చేదుభావాలను పంచుకుంది. సినిమా షూటింగ్ స్పాట్ కు వెళ్లిన తొలి రోజే ఆ ప్రముఖ హీరో తనతో అనుచితంగా ప్రవర్తించాడని, పక్కన వచ్చి కూర్చుని తన కాలిని అతడి కాలితో రుద్దడాని తెలిపింది. దీంతో కోపంతో అతని చెంప చెళ్లుమనిపించా అని చెప్పింది. సినిమా చేసే వరకు కనీసం అతనితో పరిచయం కూడా లేదని తెలిపింది. అయితే ఆ హీరో పేరు చెప్పడానికి ఆమె నిరాకరించింది.