అర్జున్ రెడ్డి ఈ మూవీ పవర్ అలాంటిలాంటిది కాదు. ఓ సామన్య నటున్ని  ఓవర్ నైట్ స్టార్ హీరోగా మార్చేసిన సినిమా ఇది. ఈ మూవీ తరువాత విజయ్ హవా అలా ఇలా లేదు. వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. గత ఏడాది గీతా గోవిందం మూవీతో వంద కోట్ల క్లబ్ లో చేరిన విజయ్ ఆ తరువాత టాక్సీ వాలాతో కూడా హిట్ కొట్టాడు. ఇక ఎన్నో క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న దేవరకొండ టాక్సీ వాలాతో మరో హిట్ కొట్టాడు.


ఇదిలా ఉండగా ఈ కుర్ర హీరో నయన తారతో జోడీ కడతారన్న వార్త ఇపుడు తెగ వైరల్ అవుతోంది. తమిళ నాట ప్రముఖ నిర్మాత అయిన ఎస్.ఆర్.ప్రభు కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ తీయనున్న సినిమాలో హీరోగా విజయ్‌ దేవరకొండ చెయ్యబోతున్నాడు.  ఈ సినిమాలో నయనతార కన్ఫర్మ్ గా నటిస్తుందట. కానీ ఈ విషయం అఫిషియల్ గా కన్ఫర్మ్ కావలసి ఉంది. ఇప్పటికే యంగ్, సీనియర్ హీరోస్ తో తెగ సినిమాలు చేస్తున్న నయనతార లేడి డైనమిక్ గా గ్లామర్ భామగా అదరగొట్టేస్తూ లేడి సూపర్ స్టార్ గా వెలుగొందుతుంది. అలాంటి విజయ్ – నయనతార కాంబోలో మూవీ అంటే ఆ సినిమా మీద భారీ అంచనాలుంటాయి.


నయన్ తో జత కడుతునన్ యంగ్ హీరో విజయ్ స్క్రీన్ మీద ఎలా రోమాన్స్ పండిస్తారో చూడాలి. ఎందుకంటే నయన్ చాలా సీనియర్ నటి. పైగా వయసులోనూ విజయ్ కంటే పెద్ద. మరి ఇలాంటి జోడీ ఎలా వెండి తెరపై వెలుగుతుందో.జనాలు ఎలా రిసీవ్ చేస్తుకుంటారో చూడాలి. ఏది ఏమైనా నయన్ అటు సీనియర్లతో, ఇటు కుర్ర హీరోలతో కూడా ఆడుతూ పాడుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: