టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ మరికొన్ని రోజుల్లో రాజా వారు రాణి గారు ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించబోతున్నాడు. ఇప్పటికే రవి కిరణ్ ఈ సినిమాకు సంబంధించిన పూర్తి కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా విజయ్ మరియు దిల్ రాజు కు ఆ కథను వినిపించగా , వీరిద్దరు కూడా రవి కిరణ్ చెప్పిన కథకు చాలా సాటిస్ఫై అయినట్లు దానితో ప్రీ ప్రొడక్షన్ పనులను చేసుకో అని చెప్పినట్లు తెలుస్తోంది.

దానితో ప్రస్తుతం రవి కిరణ్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను వేగ వంతంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఆ మూవీ పూర్తి కాగానే రవి కిరణ్ తో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే రవి కిరణ్ , విజయ్ మూవీ కి ఓ క్రేజీ టైటిల్ ని కూడా అనుకుంటున్నట్లు ఆల్మోస్ట్ ఇదే టైటిల్ ను పెట్టే ఉద్దేశంలో రవి కిరణ్ ఉన్నట్లు తెలుస్తుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కి "రౌడీ జనార్ధన్" అనే టైటిల్ ను ఈ మూవీ బృందం అనుకుంటున్నట్లు ఆల్మోస్ట్ ఈ టైటిల్ నే కన్ఫామ్ చేసి అఫీషియల్ గా ప్రకటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే రౌడీ జనార్ధన్ అని టైటిల్ లోనే పెట్టబోతున్నారు అంటే ఈ సినిమాలో విజయ్ మాస్ యాంగిల్ లో కనిపించే అవకాశాలు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక రవి కిరణ్ దర్శకత్వం వహించిన రాజా వారు రాణి గారు ఫుల్ క్లాస్ ఫిలిం. మరి ఈయన నెక్స్ట్ మూవీ తోనే మాస్ లోకి వెళ్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd