హెచ్‌1బీ వీసా దరఖాస్తుల ‘ప్రీమియం ప్రొసెసింగ్‌ (శీఘ్ర సేవలు)’ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా శనివారం తెలిపింది. పోగుపడిన వీసా దరఖాస్తులను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా పౌరసత్వం, వలసల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) స్పష్టంచేసింది.. 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్‌ 3 నుంచి దరఖాస్తులు తీసుకుంటామని వివరించింది. ‘ప్రస్తుతం ప్రీమియం ప్రొసెసింగ్‌ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయడంతో.. హెచ్‌1బీ వీసా జారీ ప్రక్రియ వేగవంతం అవుతుంది.


Image result for h1b visa

గత కొన్నేళ్లుగా ప్రీమియం ప్రొసెసింగ్‌ దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో సాధారణ దరఖాస్తులు పోగుపడుతున్నాయి. ప్రస్తుత నిలిపివేత ఆరు నెలలపాటు కొనసాగే అవకాశముంది’అని యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది. హెచ్‌1బీ వీసాల జారీకి ఎక్కువ సమయం పడుతుండటంతో సిలికాన్‌వేలీ కంపెనీలు ప్రీమియం ప్రొసెసింగ్‌ను ఆశ్రయిస్తుంటాయి. అంటే రుసుము కంటే అదనంగా రూ.81,752 (1,225 డాలర్లు) చెల్లిస్తుంటాయి. దీంతో వీసా ఇచ్చేదిలేనిది 15 రోజుల్లో యూఎస్‌సీఐఎస్‌ స్పష్టంచేస్తుంది. మామూలుగా అయితే ఈ ప్రక్రియకు మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: