ఆమె ఒక అందమైన మహిళ.. కానీ నెలకు రెండుసార్లే స్నానం చేస్తుంది. ఆమె కళ్లు కలువ పువ్వుల ఉంటాయి కానీ వాటి నుంచి నీళ్లు వస్తే ఆమె చచ్చిపోతుంది. చెమట పట్టిన సరే ఆమెకు ప్రమాదమే. ఇంకా ఆమె ఒకవేళ బై మిస్టేక్ ఆమెపై వర్షం నీరు పడిన స్విమ్మింగ్ పూల్ లో పడిన సరే ప్రాణాలు పోతాయి.. ఆమె శరీరంపై బొబ్బలు వస్తాయి. 

 

ఎందుకు అనుకుంటున్నారా ? ఆమెకు అలెర్జీ ఉంది. అయితే అది అందరికి ఉన్న అలర్జీ కాదు.. ఆమెకు చిత్రమైన అలర్జీ అది. ఆ అలర్జీ వాటర్ అలర్జీ. కొందరికి పొల్యూషన్ అలర్జీ ఉంటుంది.. మరికొందరికి ఆరంజ్అలర్జీ ఉంటుంది. మరికొందరికి మాంసం అలర్జీ ఉంటుంది. ఇలా చాలామందికి అలర్జీలు ఉంటాయి.. వాటిని తాకిన, తిన్న ప్రాణాలకే ప్రమాదం. 

 

ఈ తరహాలోనే తెస్సా హాన్సెన్ స్మిత్ అనే 21 ఏళ్ల యువతికి 'ఆక్వాజెనిక్ ఆర్టికేరియా' అనే వాటర్ అలర్జీతో బాధపడుతుంది. పొరపాటున నీళ్లు తాకిన సరే వెంటనే జ్వరం వస్తుంది. ఆ వెంటనే చర్మం బొబ్బలెక్కుతుంది. చెమట పట్టిన సరే ఆమెకు ఇలానే అవుతుంది. అందుకే ఆమె ఆదుకోవడం, తిరగడం మానేసింది. 

 

ఎక్కువ నడవను కూడా నడవదు. నెలకు రెండు సార్లు అది కూడా ఎంతో భయంతో స్నానం చేస్తుంది. ఈ అలర్జీపై తెస్సా మాట్లాడుతూ.. ''కన్నీళ్లు కూడా కార్చలేని పరిస్థితి నాది. చెమటపట్టినా సరే నాకు జ్వరం వచ్చేస్తుంది. నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు లేదా ఆహారాన్ని తిన్నా.. నా నోరు పుండులా మారిపోతుంది. నీళ్లు తాగితే నా నాలుకపై పుండ్లు వస్తాయి'' అంటూ బాధపడింది. 

 

''నాకు ఎనిమిదేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఈ విషయం తెలిసింది. అయితే, అది నీటి వల్ల వస్తుందని అనుకోలేదు. సబ్బు, షాంపూలు లేదా ఆహారం వల్ల అలర్జీ వస్తుందని నా తల్లిదండ్రులు భావించేవారు. పదేళ్ల వయస్సు వచ్చాక వైద్యులు చికిత్స అందించడం మొదలు పెట్టారు. చెప్పాలంటే నేను చాలా లక్కీ. అమ్మా నాన్న ఇద్దరూ డాక్టర్లే'' అని తెలిపింది.

 

అయితే మొదట సబ్బుల వల్ల అలర్జీ అని అనుకుంటే చివరికి వైద్య పరీక్షల్లో ఆమెకు 'ఆక్వాజెనిక్ ఆర్టికేరియా' ఉందని తెలుసుకుని షాక్ అయ్యిందట. ఈ వ్యాధి నివారణ కోసం ఆమె రోజుకు 9 రకాల మాత్రలు మింగుతుంది అని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. కాగా ప్రపంచంలో 100 కంటే తక్కువ మందికి మాత్రమే ఈ సమస్య ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ అలర్జీ చాల దారుణమైన అలర్జీ అని చెప్పచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: