ఆస్ట్రేలియాలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటన గురించి అందరికి తెలిసిందే. ఈ దారుణ ఘటనలో లక్షల హెక్టార్ల అడవి కాలిపోగా , మిలియన్ల సంఖ్యలో జంతువులు, పక్షులు చనిపోవడం ప్రపంచాన్ని కుదిపేసింది. ఆ మంటలని ఆర్పడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం తీవ్రంగా శ్రమించింది. చివరికి వరుణుడు దయతో ఆ కారు చిచ్చు ఆగిపోయింది. కానీ ఈ ఘటనలో గాయపడి ప్రాణాలతో ఉన్న ఎన్నో మూగ జీవాలని, పక్షులని స్వచ్చంద సంస్థలు కాపాడాయి. ఎంతో మంది ఆస్ట్రేలియా ప్రజల జీవనాధారాలు ఈ అగ్నికి ఆహుతయ్యాయి. దాంతో ఆకలితో అలమటిస్తున్న అక్కడి స్థానిక ప్రజలని చూసిన భారతీయ మహిళ చెలించి పోయింది..

 

 

ఆమె పేరు సుఖ్విందర్ కౌర్, గత పదేళ్లుగా ఆస్ట్రేలియా లోనే ఉంటూ, అక్కడ ఉన్న ‘సిక్కు వాలంటీర్స్ ఆస్ట్రేలియా’ అనే స్వచ్చంద సంస్థలో పని చేస్తోంది. ఆమె త్వరలో ఇండియా రావటం కోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంది. కానీ అక్కడి ఊహించని విధంగా జరిగిన కారుచిచ్చు ఘటనతో చేలించి పోయింది. ఆమె రావాల్సిన ఇండియా ప్రయాణాన్ని సైతం రద్దు చేసుకొని అక్కడి బాధితులకు అండగా నిలబడింది. తనకు తోచిన సాయం చేస్తూ,  రోజుకు దాదాపుగా 1000 మందికి సరపడా ఆహార పదార్ధాలను పంపిణి చేస్తూ, వారి ఆకలి బాధని తీర్చుతోంది. దాంతో అక్కడి స్థానిక ప్రజలు  ఆమె చేస్తున్న సాయంపై కృతజ్ఞతలు చెప్తూ  సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.

 

ఇదే విషయంపై స్పందించిన సుఖ్విందర్ మాట్లాడుతూ గత కొన్నేళ్ళుగా ఇక్కడే స్థానికంగా ఉంటున్నాను, ఇక్కడి ప్రజలతో నాకు అవినాభావ సంభంధం ఉంది. అలాంటి వాళ్ళని ఇలాంటి పరిస్థితులలో ఉన్నపుడు ఎలా వదిలి రాగాలనని’ అన్నారు. సొంత ఇంటికి చేరి ఆత్మీయులందరిని చూడాలని ఉన్నాసరే, సుఖ్విందర్ ఆపదలో ఉన్నవారికి తోడుగా నిలబడాలనుకున్న ఆమె గొప్ప మనసుకు చేతులెత్తి మొక్కుతున్నారు ఆస్ట్రేలియా ప్రజలు...

 

మరింత సమాచారం తెలుసుకోండి: