అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గడించిన కాలంగా చూస్తే అసలు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎలా ఎన్నికయ్యాడు అనిపిస్తుంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు , విధానాలు అన్నీ ప్రజా ఆమోదయోగ్యంగా ఉండకపోవడమే కాకుండా ప్రజా వ్యతిరేకతని ట్రంప్ లో ఉన్న వెకిలి తననాన్ని బయటపెడుతూ ఉంటాయి. తన మాట ప్రకారం నడుచుకోక పొతే ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్న వారినైనా క్షణాలలో పీకి పారేయడం, ఎదురు ప్రశ్నిస్తే మీడియా గొంతు నొక్కేయడం ట్రంప్ నియంతృత్వ ధోరణికి అద్దం పడుతుంది. ఒక్కో సారి ట్రంప్ చేసే వ్యాఖ్యలు వింటుంటే ట్రంప్ కి మైండ్ ఉందా దొబ్బిందా అనే సందేహం రాకమానదు...కొన్ని రోజుల క్రితం
![]()
ట్రంప్ సోదరుడి కూతురు మేరీ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలు అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ట్రంప్ పై ఓ పుస్తకం రాసి ప్రపంచ వ్యాప్తంగా పరువు పోగొట్టిన ఆమె ట్రంప్ ని ఓ మానసిక రోగితో పోల్చింది. అతడు చెప్పలేని ఓ జబ్బుతో బాధపడుతున్నాడని, ట్రంప్ ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదని, ట్రంప్ ఓ మోసగాడని పుస్తకంలో రాసుకొచ్చిన ఆమె ట్రంప్ లాంటి మానసిక జబ్బు ఉన్న వ్యక్తి అధ్యక్షుడిగా కొనసాగడం అమెరికా చేసుకున్న ఖర్మ అంటూ వ్యాఖ్యానించింది..అయితే మేరీ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ దాడిగా అనుకున్నా తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వింటే..తెలుసుకుంటే నిజంగా ట్రంప్ కి మైండ్ దొబ్బిందా అనే సందేహం కలుగక మానదు..

నవంబర్ 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ అమెరికా అశేష ప్రజానికాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు దాంతో ఒక్క సారిగా ట్రంప్వ వర్గం షాక్ అయ్యిపోయింది. కరోనా వ్యాక్సిన్ విషయంలో అడిగిన ఓ ప్రశ్నకి బదులు ఇస్తూ ఈ జనాలు ఇంతే ఒక వేళ నేను వ్యాక్సిన్ ముందుగా తీసుకుంటే ట్రంప్ స్వార్ధ పరుడు అందుకే ముందుగ వ్యాక్సిన్ తీసుకున్నాడు అంటారు..చివరిలో తీసుకుంటే సరిగ్గా వ్యాక్సిన్ పని చేయడం లేదు కాబోలు అందుకే చివరిగా తీసుకుంటున్నాడు అంటారు నేను ఏమి చేసినా జనానికి నన్ను తప్పుబట్టడం కామన్ అయ్యిపోయిందని అన్నారు. ట్రంప్ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం తాటిపట్టు కి ఎదురు దేకినట్టు ఉందని ఎన్నికలు దగ్గరపెట్టుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గెలుపు పై తీవ్రమైన ప్రభావం చూపుతుందని రిపబ్లికన్ పార్టీ నేతలు మండిపడుతున్నారు..ఇదిలాఉంటే ట్రంప్ కి మైండ్ దొబ్బిందని అనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా అంటూ అమెరికా ప్రజలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి