అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బిడెన్ తన ప్రసంగంతో అమెరికా ప్రజలను మాత్రమే కాదు యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నారు. ప్రపంచానికే పెద్దన్నగా వ్యవహరించనున్న జో బిడెన్ తాను ఏం చేస్తానో ఇక చెప్పానని చేతల్లోనే ఇకపై అన్ని విషయాలు తెలుసుకుంటారని అన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్తూనే కరోనా నుంచీ అమెరికా ప్రజలను విముక్తులను చేయడమే తనకు ఉన్న ప్రధాన సవాల్ అని ప్రకటించారు. అమెరికాను ఆర్ధికంగా గాడిలో పెట్టి, మునుపెన్నడూ చూడని సరికొత్త అమెరికాను అందరి ముందు ఉంచుతానని బిడెన్ తెలిపారు..ఇదిలాఉంటే
అధ్యక్షుడిగా ఇలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో అలా యాక్షన్ సీన్స్ లోకి దూకేశారు బిడెన్. తనతో పాటు తాను  ఏర్పాటు చేసుకున్న టీమ్ యొక్క వర్చ్యువల్ ప్రమాణ స్వీకారాన్ని వీక్షించిన బిడెన్ తనతో పాటు పనిచేయడానికి సిద్దంగా ఉన్న వాళ్లతో కాసేపు ముచ్చటించారు. అంతలోనే ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్దంగా ఉన్నవారికి హెచ్చరికలు జారీ చేశారు. మీపై నేను ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకండి, మీతో పాటు పనిచేసే సహా ఉద్యోగులను అవమాన  పరచకండి, వాళ్లకు గౌరవం ఇవ్వండి, ఒక వేళ ఏ ఉద్యోగి అయిన మీ వలన ఇబ్బందులు పడినా అవమాన పడినా క్షమించను, నా వరకూ ఆ విషయాలు వస్తే అక్కడికక్కడే ఉద్యోగం నుంచీ తొలగిస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు.
.కారణాలు చెప్పాల్సిన పనిలేదు, అంత అవసరం కూడా లేదు, ప్రపంచంలో అత్యంత విలువైన చోట మీరు పనిచేస్తున్నారనే విషయాన్నీ ప్రతీ రోజు గుర్తు పెట్టుకోండి అంటూ బిడెన్ ఒక్క సారిగా సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో అందరూ షాక్ అయిపోయారు. మనం అందరం కలిసి ఇప్పుడు కొత్త అమెరికాను నిర్మించాలి నిజాయితీగా ప్రతీ ఒక్కరూ పనిచేయాల్సిన సమయం ఇది అంటూ తన సందేశం ఇచ్చారు బిడెన్. బిడెన్ మొదటి వార్నింగ్ తాను ఏరికోరి ఎంచుకున్న టీమ్ కు ఇవ్వడంతో మిగిలిన వారి విషయాల్లో ఎలా ఉంటారో ఊహించండి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: