
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సందర్భంలో అమెరికా దేశంలో ఉన్న టెక్సాస్ నగరానికి చెందిన ట్రావిన్ వార్నర్ అనే వ్యక్తి లెనిన్ విల్లే లోని ఒక ప్రయివేటు పరీక్ష కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకున్నాడు. మొదట తనకు కరోనా వైరస్ పాజిటీవ్ వస్తుందో మో అని భయపడ్డాడు. కానీ ఆ ప్రయివేటు పరీక్ష కేంద్రం వారు వేసిన బిల్లు ను చూసి షాక్ అయ్యాడట. ఈ పరీక్ష కేంద్రంలో తాను చేసుకున్న యాంటీజెన్ పరీక్ష తో పాటు ఫెసిలిటీ ఫీజ్ కింద 54000 డాలర్లు బిల్లు చేశారట. అంటే మన ఇండియా కరెన్సిలో దాదాపు రూ. 40 లక్షలు అన్నమాట. ఇంత బిల్లు ను చూసి ట్రావిన్ వార్నర్ షాక్ తిన్నాడట. అయితే అమెరికా లో సాధారణంగా పీసీఆర్ టెస్ట్ కు 8 నుంచి 15 డాలర్ల వరకు తీసుకునే వారు. కానీ గత నెల నుంచి అమెరికా లో కరోన వైరస్ వ్యాప్తి ఎక్కువ గా ఉండటంతో మళ్లి ధరలను విపరీతంగా పెంచేసారు.