తైవాన్ చైనా ల మ‌ధ్య గ‌త కొద్ది రోజులుగా ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఎలాగైనా తైవాన్ ను త‌మ దేశంలో క‌లుపు కోవాల‌ని చైనా దేశ పాల‌కులు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనికి అనుగుణం గా అడుగులు వెస్తున్నారు. అయితే తైవ‌న్ లో ఉన్న సైనికులు మాత్రం దీన్ని వ్య‌తిరేకిస్తున్నారు. చైనాలో క‌లిసే ప్ర‌స‌క్తే లేద‌ని వారు అంటున్నారు. కానీ చైనా మాత్రం తైవాన్ విషయం చాలా క‌ఠినంగా ఉంది. తైవాన్ కేవ‌లం చైనా నుంచి విడిపోయిన ఒక రాష్ట్రమే అని అంటున్నారు. తైవాన్ పై పూర్తి హ‌క్కు చైనా దేశాని కే ఉంటుంద‌ని చైనా పాల‌కులు వాధిస్తున్నారు. ఇప్ప‌టికే తైవాన్ చుట్టూ చైనా యుద్ధ వాత‌వార‌ణం సృష్టి స్తుంది. గ‌త నాలుగు రోజుల నుంచి తైవాన్ మీదుగా యుద్ధ విమానాల‌ను తిప్పుతుంది. గ‌త కొద్ది రోజుల క్రితం ఏకంగా 52 యుద్ధ విమానాల‌ను తైవాన్ పై నుంచి పంపించి చైనా త‌న బ‌లాన్ని చూపించింది.



అయితే ఈ విష‌యం పై చైనా దేశ అద్య‌క్షుడు జిన్ పింగ్ మ‌రో సారి స్ప‌ష్టం చేశారు. చైనా లో నియంతృత్వ పాల‌న ముగిసి 110 సంవ‌త్స‌రాలు అయిన సంద‌ర్భంగా బీజింగ్ లో ఒక స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో చైనా దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ తైవాన్ విషయంలో ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  తైవాన్ విష‌యం లో తగ్గేదే లేద‌ని అంటున్నారు. తైవాన్ పూర్తిగా చైనా అంత‌ర్భాగ మేన‌ని ప్ర‌క‌టించారు. ఈ విష‌యం లో ఎవ‌రూ కూడా త‌ల‌దూర్చ‌కూడ‌ద‌ని అన్నారు. తైవాన్ పై చైనా సార్వ‌భౌమాధికారం క‌లిగి ఉంటుంద‌ని అన్నారు. దీనిని ఎవ‌రు మార్చలేర‌ని స్ప‌ష్టం చేశారు. చైనాలో తైవాన్ క‌ల‌వ‌డం అక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఇష్టామేన‌ని అన్నారు. కానీ అక్క‌డి స్వ‌తంత్ర సైన్య‌మే అడ్డు ప‌డుతుంది అని తెల‌పారు. అయితే ఎవ‌రు అడ్డ ప‌డ్డ తైవాన్ ను చైనాలో క‌ల‌ప‌డం ఖాయం అని స్ప‌ష్టం చేశారు.





మరింత సమాచారం తెలుసుకోండి: