దాయాది దేశమైన పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ప్రస్తుతం పాకిస్థాన్లో పదవి కోల్పోయెందుకు సిద్ధంగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు భారత్ ను పొగుడుతూ వ్యాఖ్యలు చేయడం మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం పాకిస్తాన్ పార్లమెంట్ లో ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల భారత దేశ విదేశాంగ విధానాన్ని పొగడ్తలతో ముంచెత్తాడు. భారత దేశ విదేశాంగ విధానం భేష్ అనీ.. దేశ తమ పౌరుల కోసం భారత్కు ఎంతవరకైనా వెళ్తుందని చెప్పుకొచ్చాడు.
ఇక ప్రభుత్వంలో ఇండియన్ ఆర్మీ జోక్యం చేసుకోదని.. భారత ఆర్మీ పై కూడా ప్రశంసలు కురిపించాడు. పాకిస్తాన్ ఆర్మీ కి డబ్బులు ఇచ్చి ప్రభుత్వానికి కాపాడుకో లేము అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్ ఖాన్. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా లొంగే ప్రసక్తేలేదని రాజీనామాకు సిద్ధం గా ఉన్నాను అంటూ ఇమ్రాన్ఖాన్ చెప్పుకొచ్చాడు. అయితే ఇస్లామిక్ దేశాల సదస్సు తర్వాత ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలని పాకిస్థాన్ ఆర్మీ అల్టిమేటం జారీ చేసింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి