కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి ప్రపంచ దేశాలను ఎంతలా వణికించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మహమ్మారి వ్యాధి బారినపడి కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా వైరస్ తర్వాత ఎక్కడైనా కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది అంటే చాలు ప్రపంచం మొత్తం వణికి పోయే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది అన్నది తెలుస్తుంది. ఇక ఇటీవల కాలంలో ప్రపంచ దేశాలలో కొత్తరకం కరోనా వేడి  వెలుగులోకి వస్తు అందరిని భయపెడుతూ ఉంది అన్న విషయం తెలిసిందే.


 ఇప్పుడు మరో కొత్త రకం వైరస్ వెలుగులోకివచ్చింది అన్నది తెలుస్తుంది. కొత్తరకం వైరస్ గురించి తెలుసుకునే ముందు ఒక స్టోరీ గురించి తెలుసుకోవాలి. జాంబీస్ స్టోరీస్.. హాలీవుడ్ లో జాంబి  నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. జాంబి వైరస్ సోకిన వారు ఇక సాటి మనుషులను దారుణంగా కొరికి చంపడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక తద్వారా అలా చనిపోయిన వారు మళ్ళీ జాంబిలుగా మారుతూ ఉంటారు. ఇక ఇదే కాన్సెప్ట్ తో  తెలుగులో కూడా జాంబి రెడ్డి అనే సినిమా వచ్చింది అనే విషయం తెలిసిందే. దీంతో జాంబీస్ అనే కాన్సెప్ట్ అందరికీ పూర్తిగా అర్థమైపోయింది.

 ఇక ఇప్పుడు ఏకంగా జాంబి అనే వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ అంటే ఇక మానవాళి మొత్తం మటాష్ అయినట్లేనా అని అనుకుంటున్నారు కదా..  భయపడిపోకండి.. ఎందుకంటే ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది మనుషుల్లో కాదు. కెనడాలో ఉన్న జింకల్లో. జింకల్లో ఇక ఈ జాంబి వైరస్ వెలుగులోకి రావడంతో వైరస్ సోకిన జింకలు మరికొన్ని జింకలను చంపేస్తూ ఉన్నాయట. జింకలలో ఈ వైరస్  వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తుంది. 1996 పశువుల్లో ఇక ఈ జాంబి వైరస్ను గుర్తించినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు  జంతువుల నుంచి మనుషులకు కూడా ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉందట. దీంతో ఇక ఈ వైరస్ పై పరిశోధనలు శరవేగంగా చేస్తున్నట్లు కెనడా వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: