ఇటీవలి కాలంలో టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెరిగిపోయిన టెక్నాలజీని అందరూ ఎన్నో వినూత్న ఆవిష్కరణలు కోసం ఉపయోగిస్తారు. కానీ కొంతమంది మాత్రం  టెక్నాలజీతో ఎన్నో నేరాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇటీవలి కాలంలో అయితే యాంకర్లు ఎంతలా రెచ్చిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వెబ్ సైట్ లను  హ్యాక్ చేయడం.. ఇక తమ కంట్రోల్ లోకి తీసుకొని చిత్ర విచిత్రమైన పనులు చేయడం లాంటివి కూడా చేస్తున్నారు.


 అయితే ఎవరో ఒకరి వ్యక్తిగత ఖాతాలను హ్యాక్ చేయడం ఇలాంటివి చేసి షాకిస్తున్న హ్యాకర్లు కొన్ని కొన్ని సార్లు ఏకంగా ప్రభుత్వానికి షాక్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇలా హ్యాకర్లు ఇటీవలి కాలంలో రెచ్చిపోతున్న తీరు అటు నిఘా వ్యవస్థకే సవాల్ విసిరే విధంగానే ఉంది. ఇక్కడ ఇలాంటి వూహించని ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా ఎయిర్పోర్టులో ప్రయాణికుల సౌకర్యార్థం ఎన్నో పెద్దపెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఆ స్క్రీన్ ల ద్వారా తమకు కావాల్సిన సమాచారాన్ని పొందుతూ ఉంటారు ప్రయాణికులు. కానీ ఇటీవలే హ్యాకర్లు రెచ్చిపోయారు.


 ఏకంగా ఎయిర్పోర్టులో ఉన్న స్క్రీన్ డిస్ ప్లే లను తమ ఆధీనంలోకి తెచ్చుకొని అక్కడ పోర్న్ వీడియోలు ప్లే చేయడం మాత్రం సంచలనంగా మారిపోయింది. బ్రెజిల్లోని రియో డి జనీయోరో ఎయిర్ పోర్టులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎలక్ట్రానిక్ డిస్ ప్లే లను దుండగులు హ్యాక్ చేసారూ. ఈ క్రమంలోనే ప్రకటనలు విమానాల సమాచారానికి బదులు పోర్న్ వీడియోలు స్క్రీన్ ల పై ప్రసారం చేయడం గమనార్హం. దీంతో ప్రయాణికులు ఎంతగానో ఇబ్బంది పడి పోయారు. వెంటనే ఎయిర్ ఫోర్స్ సిబ్బంది గమనించి అప్రమత్తమయ్యారు.  ఆ స్క్రీన్ లను  ఆపేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: