ఒకప్పుడు ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే కేవలం ఆర్టీసీ బస్సులు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఆటోలు అందుబాటులో ఉన్నప్పటికీ ఇక వారు చెప్పే ధరలతో జేబుకు చిల్లుపడేది అని చెప్పాలి. దీంతో ఎంతోమంది ఆటోలను ఆశ్రయించకుండా కేవలం ఆర్టిసి బస్సుల్లో మాత్రమే ప్రయాణం చేసేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం అటు ప్రతి ఒక్కరి జీవితంలో క్యాబ్ అనేది ఒక భాగంగా మారిపోయింది. ఇక మన దగ్గర కార్ లేకపోయినా పరవాలేదు ఇక అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో ఒక్క క్లిక్ ఇచ్చి ఇంటిముంగి ఒక కారును తెప్పించుకోవడం ఆ కారులో దర్జాగా వెళ్లాల్సిన చోటుకు వెళ్లడం లాంటివి చేస్తూ ఉన్నారు ఎంతోమంది.


 ఇలా ఇప్పుడు క్యాబ్ సర్వీస్ లను అందించేందుకు ఓలా, రాపిడో, ఉబర్ లాంటి ఎన్నో రకాల సంస్థలు అందుబాటులో ఉన్నాయి అని చెప్పాలి. సరళమైన ధరలకే ఇక ఇప్పుడు క్యాబ్ సర్వీస్ లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం కంటే ఈ క్యాబ్ లో ప్రయాణించడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రతి మనిషి జీవితంలో ఇలా క్యాబ్ సర్వీస్ అనేవి భాగంగా మారిపోయాయి. సాధారణంగా ఒక వ్యక్తి క్యాబ్ ఎక్కిన తర్వాత ఇక అతని గమ్యస్థానానికి చేర్చితే ఇక ఆ క్యాబ్ డ్రైవర్ బాధ్యత తీరిపోతుంది. కానీ ఇక్కడ ఒక క్యాబ్ డ్రైవర్ మాత్రం ఎవరు చేయలేని పని చేసి ప్రస్తుతం ప్రశంసలు అందుకుంటున్నాడు అని చెప్పాలి. ఒక ఉబర్ క్యాబ్ డ్రైవర్ చేసిన సహాయం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 అమెరికాకు చెందిన టిమ్ అనే వ్యక్తి ఉబర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.  అయితే మూడేళ్ల క్రితం తన కారు ఎక్కిన సుమిల్ తో అతడికి పరిచయం ఏర్పడింది అని చెప్పాలి. కాగా ఆ తర్వాత కాలంలో సుమిల్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు అన్న విషయం ఉబర్ డ్రైవర్ టిమ్ కి తెలిసింది. దీంతో ఇక వారి మధ్య ఉన్న చిన్న పరిచయంతోనే ఏకంగా తన కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు టిమ్. గత డిసెంబర్ లో ఆపరేషన్ జరిగి సుమిల్ కోలుకున్నాడు అని చెప్పాలి. ఇక తన స్నేహితుడు క్యాబ్ డ్రైవర్ టిమ్ చేసిన సహాయాన్ని  సుమిల్ సోషల్ మీడియాలో చెప్పడంతో అతనిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri