
అయితే మొన్నటి వరకు గిన్నిస్ బుక్ రికార్డు అనే పేరు వినిపించింది అంటే చాలు ఎంతోమంది చేసే ప్రమాదకరమైన విన్యాసాలు అందరికీ గుర్తుకు వచ్చేవి. ఏకంగా ప్రాణాలను పణంగా పెట్టి మరి ఏదో ఒక విన్యాసం చేసి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకునేవారు చాలామంది. ఇక మరికొంతమంది ఒకే విషయంపై ఏళ్ల తరబడి కఠోర శిక్షణ తీసుకొని గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకునేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎంతో మంది చిన్న చిన్న విషయాలతోనే గిన్నిస్ బుక్ లో తమ పేరును ఎక్కించుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటివి చేసి కూడా వరల్డ్ రికార్డ్ సాధించవచ్చ అని ఈ విషయం గురించి తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.
ఇక్కడ గడ్డం పెంచుకోవడం ద్వారా ఒక వ్యక్తి ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డులో చోటు సంపాదించుకోగలిగారు. అదేంటి గడ్డం పెంచుకుంటే కూడా గిన్నిస్ బుక్ లో చోటు దక్కుతుందా అని ఆశ్చర్యపోతున్నారు కదా... అయితే ఇలా గడ్డం పెంచుకుంది పురుషుడు కాదు.. మహిళ. గడ్డం మీసాలను పొడవుగా పెంచి రికార్డులు సృష్టిస్తున్న పురుషులను చూసాం. కానీ ఇక్కడ ఒక మహిళ గడ్డం మీసం పెంచి గిన్నిస్ రికార్డు సృష్టించింది. అమెరికాకు చెందిన 74 ఏళ్ల వివిఎన్ వీలర్ అనే మహిళకు హైపర్ ట్రైకోసిస్ సిండ్రోమ్ కారణంగా గడ్డం మీసం వచ్చింది. మొదట షేవింగ్ చేసుకోగా తర్వాత మాత్రం ఇలా పొడవుగా గడ్డం మీసం పెంచి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించింది అని చెప్పాలి.