అమెరికాలో కిలో బియ్యం 300 రూపాయల దాకా పలుకుతోంది. అమెరికాలో రాబోయే రోజుల్లో బియ్యం కొరత ఏర్పడనుందనే ప్రచారంతో ఎన్ఆర్ఐలు విపరీతంగా బియ్యం కొనుగోలు చేసుకుంటున్నారు. దాదాపు ఆరు నెలలకు సరిపడా బియ్యాన్ని కొని స్టాక్ పెట్టుకుంటున్నారు. దీంతో అక్కడ కృత్రిమ కొరత ఏర్పడింది.


ఆయా షాపుల యజమానులకు ఒక్కసారిగా ఒక సంచి లేదా రెండు సంచులు తీసుకెళ్లే వారు ఏకంగా ఆరు నెలలు సరిపడా కొనడం ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో అనుకున్న స్టాక్ కంటే ముందే అయిపోవడంతో ఈ నోటా ఆ నోటా అది కాస్త వైరల్ అయింది. ఇండియాలో వరదలు వస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో బియ్యం కొరత ఏర్పడుతుందని ప్రచారం జరిగింది. ఇండియాలో ఎన్ని వరదలు వచ్చినా వరి పంట మాత్రం జోరుగానే పండుతుంది.


ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరి ఎక్కువగా పండిస్తున్నారు. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో బియ్యానికి కొరత ఎక్కువ ఉండదు. కానీ సన్నబియ్యం తినేందుకు అమెరికాలో ఉండే ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారు ఇష్టపడతారు. వాటి దిగుమతి తగ్గిపోతుందని వార్తలు రావడంతో సూపర్ మార్కెట్లలో ఉన్న బియ్యాన్ని కొనేశారు. ఇండియాలో ఎన్ని వర్షాలు పడినా రెండు సార్లు బియ్యం పండుతాయి. కాబట్టి దాని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కావాలనే రేట్లు పెంచితే తప్ప బియ్యం రేట్లు పెరగడం అనేది జరగదు.


తెలంగాణలో, ఆంధ్రలో ప్రస్తుతం చాలా వరకు ధాన్యం పండిస్తున్నారు. రైతులను ఇతర వాణిజ్య పంటల వైపు మళ్లించేందుకు తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది అంత ఈజీగా జరగడం లేదు. పంటల విషయంలో సరైన విధానాన్ని ఎంచుకుని సాగులో దిగుబడి పెంచుకోవాలని సూచిస్తున్నారు. దీని కోసం వ్యవసాయాధికారుల నుంచి సలహాలు తీసుకోవాలని చెబుతున్నారు. కానీ కోతుల బెడద, పండిన పంటను అమ్ముకోవడం వల్ల ఎదురయ్యే సమస్యలతో వరికే మొగ్గు చూపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: